పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ను వివాదాలు వీడటం లేదు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజైన ఈ మూవీ కొత్త పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత ఓం రౌత్ తెరకెక్కకిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. రాయాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. కనీవినీ ఎరుగని బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం అంటూ మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలయ్యాక దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. టీజర్ మీద, ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రామాయణం పేరు చెప్పి బొమ్మల చిత్రం తీస్తున్నారంటూ.. ఇది రామాయణంలా ఉందా అంటూ ట్రోల్స్ నడిచాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
టీజర్ రిలీజ్‌కు ముందు వరకు ‘ఆదిపురుష్’పై ఉన్న అంచనాలు.. ఆ తర్వాత అమాంతం పోయాయి. టీజర్‌పై వచ్చిన ట్రోల్స్ చూసిన తర్వాత సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. జూన్‌లో విడుదల చేస్తామని చెప్పి.. గ్రాఫిక్ వర్క్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ‘ఆదిపురుష్’ మీద ఏ అప్డేట్ లేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపించింది. అయితే తాజాగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆ మూవీ నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. ప్రభాస్, కృతి సనన్‌తో పాటు లక్ష్మణుడు, ఆంజనేయుడి పాత్రలు ఉన్నాయి.
నయా పోస్టర్ కూడా గ్రాఫిక్ పోస్టర్‌లాగే ఉండటంతో మరోసారి ‘ఆదిపురుష్’ మేకర్స్ మీద ట్రోల్స్ వచ్చాయి. అలాగే అందులో సీతమ్మ తల్లి మెడలో తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడికి పూర్తిగా గడ్డం ఉండటంతో వీటి పైన కూడా ట్రోల్స్ చేస్తున్నారు. పోస్టర్ రియలిస్టిక్‌గా లేదని మళ్లీ గ్రాఫిక్స్ ఉన్నాయని.. దీనికంటే ఫ్యాన్స్ చేసిన పోస్టర్లే బాగున్నాయంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు బాలీవుడ్ మూవీ ఫ్యాన్స్ కూడా ‘రామాయణం గురించి తెలుసా?’ అంటూ ఓం రౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఇంతగా ట్రోల్ అవుతున్న ‘ఆదిపురుష్’ విడుదల తర్వాత ఏమవుతుందో చూడాలి. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
As a filmmaker,one should never take up a religious subject as popular as Ramayan and create his own narrative against people’s perception.Your approach looks dishonest and characters you depicted look horrible to say the least. Be prepared for public backlash.
— Prof.N John Camm (@njohncamm) March 30, 2023
Endhi anna ee poster uuu
Sarle edho okati #Prabhas anna vunnad chaalu
Jai Shri Ram #AdipurushAagamanam #Adipursh pic.twitter.com/P7mteKYQpk— Vicky ˢᵃˡᵃᵃ⸢ (@vikasthegreat_) March 30, 2023
Lord Sri Rama with a moustache. Lord Lakshmana with a beard. Which scriptures is this description taken from?
— Ovo (@VanKhomain) March 30, 2023