ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించడానికి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర తారాగణానికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. రామయణ ఇతి వృత్తంతో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే ఆదిపురుష్ మ్యానియా మొదలైంది. నిన్నటి నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర సందడి చేయటం మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో తప్పితే.. ఏ విషయంలోనూ ఆదిపురుష్ తమను మెప్పించలేకపోయిందని ప్రేక్షకులు వాపోతున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాను తీసి డబ్బులు వృధా చేశారంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక, ఈ నేపథ్యంలోనే సినిమా బడ్జెట్, సినిమా కోసం ఒక్కో యాక్టర్ తీసుకున్న రెమ్యూనరేషన్‌కు సంబంధించిన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా కోసం ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే.. ఈ సినిమా దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. రాముడి పాత్రలో కనిపించిన ప్రభాస్ దాదాపు 100-150 కోట్ల రూపాయలు తీసుకున్నారట. ప్రతి నాయకుడు రావణుడి పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ 12 కోట్లు.. సీత పాత్రలో నటించిన కృతీ సనన్ 3 కోట్ల రూపాయలు.. లక్ష్మణుడి పాత్రలో నటించిన సన్నీ సింగ్ 1.5 కోట్లు..
ఆంజనేయుడి పాత్రలో నటించిన దేవ దత్త నాగే కోటి రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నారట. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా. మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చినా.. మౌత్ టాక్ కారణంగా తర్వాతి కాలంలో వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే గానీ సినిమా గట్టు ఎక్కే పరిస్థితి లేదు. మరి, ఆదిపురుష్ సినిమా తారాగణం తీసుకున్న షాకింగ్ రెమ్యూనరేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.