పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రాధేశ్యామ్ తో నిరాశపరిచిన ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలున్నాయి. ఇందులో ముందుగా ఆదిపురుష్ సినిమా తెరమీదకు రానుంది. 2023 సంక్రాంతి కానుకగా (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఊహించని స్థాయిలో రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ షూటింగ్ ముగించుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ డిజిటల్ హక్కులను భారీ ధరకు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. అదికూడా రిలీజ్ ముందే ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 250 కోట్లకు కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాను సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్ తో టి సిరీస్, రిట్రోఫిల్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఇక రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనుండగా, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకులలో, ప్రభాస్ ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మరి ఆదిపురుష్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Adipurush Digital Rights acquired by netflix for a record amount of Rs.250 cr.
#Prabhas pic.twitter.com/x72qJluQzq
— MOVIE HERALD (@MovieHerald_) August 2, 2022