ఆదిపురుష్ సినిమా మూడవ రోజు ఆదివారం కావటంతో మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే, 4వ రోజు మాత్రం కలెక్షన్ దారుణంగా పడిపోయింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. రామాయణ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందునుంచి విమర్శలు ఎదుర్కొంటూ వస్తోంది. ట్రోల్స్ నడుమే ఆదిపురుష్ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండవ రోజు శనివారం 100 కోట్ల రూపాయలు సాధించింది. ఇక, మూడవ రోజు ఆదివారం కావటంతో వసూళ్ల విషయంలో ఆదిపురుష్‌కు కలిసొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
మూడు రోజుల పాటు మంచి కలెక్షన్లను కొల్లగొట్టిన ఆదిపురుష్ నాలుగవ రోజు ఢీలా పడింది. దారుణమైన వసూళ్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 14 కోట్లు రాగా.. హిందీ బెల్ట్‌లో 11 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో సినిమా దాదాపు 375 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. గత మూడు రోజుల కలెక్షన్లతో పోల్చుకుంటే నాలుగవ రోజు కలెక్షన్లు రెండితలు పడిపోయాయి.
ఇదే గనుక కొనసాగితే ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ సాధించటం చాలా కష్టం అవుతుంది. నిర్మాతలకు నష్టాలు మిగలటం ఖాయం. కాగా, ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రకు మీసాలు ఉండటం పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాదు! రావణాసురుడి గెటప్‌పై కూడా మొదటి నుంచి విమర్శలు వచ్చాయి. అంతేకాదు! సినిమాలోని కొన్ని సీన్లు అస్సలు బాగోలేవంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలైంది. కొందరు నెటిజన్లు మీమ్స్ రూపంలో దర్శకుడు ఓం రౌత్, ఆదిపురుష్‌లోని రావణాసురుడి గెటప్‌పై ట్రోల్స్ చేస్తున్నారు.