ఈమె చైల్డ్ ఆర్టిస్ గా ఫేమ్ తెచ్చుకుంది. హీరోయిన్ గానూ సక్సెస్ అందుకుంది. ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంతే ఫాస్ట్ గా ఇండస్ట్రీకి దూరమైంది. మరి ఈ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.
ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. కొందరు బ్యూటీస్ ని మినహాయిస్తే.. మిగిలిన వాళ్లందరూ కూడా ఇలా వచ్చి, ఉన్నంతలో చకాచకా సినిమాలు చేసేసి కనుమరుగైపోతుంటారు. అలా టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది ఎంతోమంది కొత్త భామలు వస్తుంటారు. ఆల్రెడీ ఉన్నవాళ్లు వెళ్లిపోతుంటారు! పైన ఫొటోలో కళ్లద్దాలు పెట్టుకున్న ఉన్న ఆమె కూడా తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు అయిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్లు దాదాపు ప్రతి ఒక్కరూ స్టార్స్ అయిపోదామని ఇండస్ట్రీలోకి వస్తుంటరు. కాకపోతే అందరికీ ఆ అదృష్టం దక్కకపోవచ్చు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు షీలా కౌర్. ఎవరా అని ఆలోచిస్తున్నారా? అలా థింక్ చేస్తూనే స్టోరీ చదివేయండి. 1995లోనే తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ఆరేడేళ్లు అలా యాక్ట్ చేస్తూ వెళ్లింది. ఓ నాలుగేళ్లు బ్రేక్ తీసుకుని.. ‘సీతాకోక చిలుక’ అనే తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అలా హీరోయిన్ గా 2006లో ఫస్ట్ తెలుగు మూవీ చేసిన షీలా కౌర్.. 2011లో చివరగా బాలయ్య ‘పరమవీరచక్ర’లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగుకు దూరమైపోయింది. ఈమె చేసిన వాటిలో రాజుభాయ్, పరుగు, మస్కా, అదుర్స్ సినిమాలతో పేరు తెచ్చుకుంది. కానీ దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. లాక్ డౌన్ టైంలో సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమెకు పాప కూడా పుట్టింది. తాజాగా ఆమె ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెని గుర్తుపట్టిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈమె ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.