ఆమె హీరోయిన్. క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది. అలానే ఓ ప్రాచీన క్రీడలో ఎక్స్ పర్ట్ కూడా. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఓ మూవీ కాంట్రవర్సీలో చిక్కుకుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
హీరోయిన్లకు ఉండాల్సింది, ఆడియెన్స్ కు కావాల్సింది ఏంటి అంటే అందరూ చెప్పే మాట గ్లామర్. ముద్దుగుమ్మలు వాళ్ల బాడీని షేప్ లో ఉంచుకుంటే ఛాన్సులు వస్తాయి. ఏ మాత్రం బొద్దుగా ఉన్నాసరే సినిమా అవకాశాలు తగ్గిపోతాయేమోనని భయపడుతుంటారు. అందుకే ఫిట్ గా ఉండేందుకు జిమ్, యోగాలాంటివి చేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తెలుగులోనే హీరోయిన్ గా చేసిన ఓ బ్యూటీ మాత్రం మరో అడుగు ముందుకేసింది. ప్రాచీన క్రీడని నేర్చుకుంది. అందులో సూపర్ ఎక్స్ పర్ట్ కూడా అయిపోయింది. మరి ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పూరీ జగన్నాథ్ తీసిన ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలోనూ నటించింది. కానీ ఎందుకో ఆ తర్వాత కెరీర్ ని సరిగా ప్లానింగ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమెనే అదాశర్మ. ముంబయిలో పుట్టి పెరిగిన ఈమె.. పదో క్లాస్ లో ఉన్నప్పుడే హీరోయిన్ అవుదామని ఫిక్స్ అయి, చదువు మానేస్తానని ఇంట్లో చెప్పింది. పేరెంట్స్ బలవంతం మీద ఇంటర్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేసింది. 2008లో వచ్చిన ‘1920’ అనే హిందీ మూవీతో నటిగా మారింది అదాశర్మ.
ఆ తర్వాత బాలీవుడ్ లోనే మరో రెండు సినిమాలు చేసిన అదాశర్మ.. 2014లో ‘హర్ట్ ఎటాక్’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో నటించింది. గతేడాది రిలీజ్ అయిన ‘మీట్ క్యూట్’ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటిస్తున్న ‘ద కేరళ స్టోరీ’ సినిమా ఇప్పటికే వివాదాల్లో చిక్కుకుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. అదా తల్లి క్లాసికల్ డ్యాన్సర్. అలానే మల్లకంబు అనే ప్రాచీన విద్యకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తుంటారు. అలా దీన్ని నేర్చుకున్న ఈ హీరోయిన్.. అనుభవజ్ఞుల కంటే దీటుగా జిమ్నాస్టిక్స్ చేస్తూ ఆ వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటుంది. సరే ఇదంతా పక్కనబెడితే.. చిన్నప్పటి ఫొటో చూసి ఈమెని ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.