సినిమా ఇండస్ట్రీలో వేధింపులు అనేవి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. గతంలో పెద్దగా ఎవరూ బయటపడేవారు కాదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం తాము ఫేస్ చేసిన అనుభవాలు, ఎదుర్కొన్న వేధింపుల్ని బయటపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్నాళ్లముందు మీటూ ఉద్యమం పేరుతో పెద్ద ఇష్యూనే జరిగింది. అయితే ఇలాంటి వేధింపులు ఎక్కువగా మహిళా నటుల విషయంలోనే జరుగుతున్నాయి. తాజాగా అలాంటిదే తనకు జరిగిందని, స్టార్ హీరో రాత్రి కాల్ చేసి తనని వేధింపులకు గురిచేశాడని స్టార్ హీరోయిన్ ఇంటర్వ్యూలో వాపోయింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. మన దేశంలో చిన్న చిన్న సినిమా ఇండస్ట్రీలు చాలానే ఉన్నాయి. వాటిలో భోజ్ పురి ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి. అక్కడ సూపర్ స్టార్ పవన్ సింగ్ పలు సినిమాల్లో హీరోగా నటించి ఫేమ్ సంపాదించాడు. ఇప్పుడు అతడిపైనే నటి యామినీ సింగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అతడితో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఎందుకంటే ఆయన చేసే సినిమాల్లో లేడీ యాక్టర్స్ కు సరైన పాత్రలు దక్కవని కొన్నేళ్ల క్రితం యామినీ చెప్పింది. నిజానికి పవన్ తో కలిసి పనిచేయకపోవడానికి కారణం వేరే ఉందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ యామినీ బయటపెట్టింది.
‘అతడు నాకు మూవీ ఛాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అది చాలా రాంగ్. నా మొదటి సినిమా ‘బాస్’ అవకాశమిచ్చింది దర్శకుడు అరవింద్ చౌబే. ఈ చిత్రం నుంచి నన్ను ఎవరూ తీసేయలేదు. నేను తప్పుకొన్నాను. పవన్ చాలా మంచి యాక్టర్ అని నాకు అప్పటికి తెలుసు. సెట్స్ లో ఫస్ట్ టైం కలిసినప్పుడు అతడితో అదే చెప్పాను. అప్పటివరకు అతడి గురించి నిజం నాకు తెలియదు. ఎందుకంటే ఓరోజు రాత్రి 9 గంటలకు అనుకుంటా కాల్ చేశాడు. ఆటోలో స్టూడియోకు రమ్మని అడిగాడు. ఈ టైంలో రాలేనని చెబితే.. సినిమా చేయాలని ఉందా లేదా? అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు కాల్ కట్ చేసి, సినిమా నుంచి సైడ్ అయిపోయాను’ అని యామినీ చెప్పుకొచ్చింది. మరి హీరో పవన్ చేసిన ఆరోపణల గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.