ఎన్ని లగ్జరీ కార్లున్నా కానీ బీఎండబ్ల్యూలో వచ్చే న్యూ ఎడిషన్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సెలబ్రిటీలు. ఏ కొత్త మోడల్ వచ్చినా వెంటనే దాన్ని బుక్ చేసేసి తమ గ్యారేజ్‌లో పెట్టేస్తుంటారు.
సెలబ్రిటీల ఆఫ్‌స్క్రీన్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఆసక్తి చూపుతుంటారు. నివసించే ఇంటి దగ్గరి నుండి ధరించే డ్రెస్సెస్, యాక్ససరీస్, జ్యువెలరీ, వాడే లగ్జరీ కార్ల వంటి వాటికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసి షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతుంటారు. రీసెంట్‌గా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ దగ్గరా లేని గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కార్ కొన్నారనే వార్త తెగ చక్కర్లు కొడుతోంది. తన రేంజ్‌కి తగ్గట్టుగా ఈ రేంజ్ రోవర్‌ని ఏకంగా రూ. 5.4 కోట్లు పెట్టి కొన్నారట. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ తదితరుల దగ్గర రేంజ్ రోవర్ ఉన్నా గోల్డ్ కలర్ SV ఉంది మాత్రం మహేష్ ఒక్కడి దగ్గరే. ఇక కోలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ షాలు షమ్మూ కూడా తన డ్రీమ్ కార్ కొనుక్కుంది. రూ. 1 కోటి విలువైన జాగ్వార్ కారును సెకండ్ హ్యాండ్‌లో రూ. 50 లక్షలకు కొనుక్కున్నట్లు వెల్లడించింది. కారు తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది షాలు.
ఇప్పుడు పాపులర్ హీరోయిన్ యామీ గౌతమ్ కూడా తనకిష్టమైన లగ్జరీ కార్ కొనుగోలు చేసింది. ‘విక్కీ డోనర్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాల్లోని నటనతో ఆకట్టుకున్న యామీ తెలుగు, హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో నటించింది. ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లాంటి సినిమాలు చేసింది కానీ సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. 2021లో ‘ఉరి’ దర్శకుడు ఆదిత్య ధర్‌ని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠిల OMG సీక్వెల్ OMG 2తో పాటు ‘ధూమ్ ధామ్’ అనే సినిమా కూడా చేస్తోంది. ఈ ‘ధూమ్ ధామ్’ కి దర్శక నిర్మాత ఆమె భర్తే.
యామీ తాజాగా లగ్జీరియస్ బీఎండబ్ల్యూ ఎక్స్7 కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కార్లు విక్రయించే డీలర్‌షిప్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా తమ బ్రాండ్ న్యూ కార్‌తో యామీ తన భర్త ఆదిత్య కలిసున్న ఓ స్టైలిష్ పిక్‌ని షేర్ చేశారు. యామీ దగ్గరున్న వాటిలో ఈ బీఎండబ్ల్యూనే ఖరీదైన కారని తెలుస్తోంది. ఈ కారు కాస్ట్ రూ. 1.24 కోట్లని సమాచారం. ఇప్పటికే ఆమె గ్యారేజీలో ఆడి ఏ4, ఆడి క్యూ7 కార్స్ ఉన్నాయి. ఇది ఖరీదైన మూడో కార్. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు యామీ, ఆదిత్య జంటకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.