Y. Vijaya: తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, క్యారెక్టర్లు చేసిన సీనియర్ నటి వై. విజయ గారి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించిన విజయ.. చాలా గ్యాప్ తర్వాత ఎఫ్2, ఎఫ్3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక తాజాగా సుమన్ టీవీతో ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కెరీర్, సినిమాలు, కోట్ల ఆస్తుల గురించి పలు కీలక విషయాలను షేర్ చేసుకున్నారు.
ఈ క్రమంలో వై. విజయ మాట్లాడుతూ.. “నటిగా గుర్తింపు వచ్చాక తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళం సినిమాలు కూడా చేశాను. ఆ టైంలోనే సంపాదించిన డబ్బుతో చెన్నైలో ఇల్లు కట్టుకున్నాను. ఓ రకంగా నేను ఆర్థికంగా ఈ స్థాయిలో ఉండడానికి విజయశాంతి కూడా ఓ కారణం. మేమిద్దరం కలిసి సినిమాలు చేసే రోజుల్లో.. పెట్టుబడుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ విధంగా విజయశాంతి ఇచ్చిన ఐడియాతో తంజావూరులో ఓ కళ్యాణమండపం, కాంప్లెక్స్ కట్టాం. ఇప్పుడు వాటి ఆదాయంతో హ్యాపీగా ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వై. విజయ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆమె మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.