ఇండస్ట్రీలో వరుస విషాదలకి బ్రేక్ పడటం లేదు. తాజాగా వివాదాస్పద నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ వనితా విజయ్‌కుమార్ ఇంట దారుణం చోటు చేసుకుంది. వనితా విజయ్ కుమార్ అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. వనితా విజయ్ కుమార్ ఈ విషాద వార్తను స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా వనిత ఓ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేసింది.
“ఈరోజు విషాదకర వార్తతో ఉదయం నిద్ర లేచాను. నా 20 ఏళ్ల మేనకోడలు అనిత మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె నాకు దేవుడిచ్చిన కూతురులాంటిది, నాకు పెద్దకూతురు వంటిది. చనిపోయిన అనిత ఎంతో మంచిది. జీవితంలో ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకునేది. ఎప్పుడూ నాకు మద్దతుగా నిలబడేది” అంటూ తన బాధని తెలియచేసింది.
మాములుగా అన్నీ విషయాల్లో వనితా విజయ్ కుమార్ ని అన్నీ విషయాల్లో ట్రోల్ చేసే అభిమానులు ఈ ఒక్క విషయంలో మాత్రం ఆమెకి అండగా నిలుస్తున్నారు. మీరు త్వరగా ఈ బాధ నుండి కోరుకోవాలి అంటూ.. వనితా విజయ్ కుమార్ కి ధైర్యం చెప్తుండటం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.