చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో ఎప్పుడూ ఊహించలేరు. ఎందుకంటే.. తొంబై తొమ్మిది పాజిటివ్స్ ఉన్నా.. జరిగిన ఒకే ఒక్క నెగటివ్ పైనే అందరి ఫోకస్ పడుతుంది. సో.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ అన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ అందాలను భూతద్దం పెట్టినట్లుగా జూమ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారని.. అలాంటివి పట్టించుకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉండలేమని అంటోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్.
చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో ఎప్పుడూ ఊహించలేరు. ఎందుకంటే.. తొంబై తొమ్మిది పాజిటివ్స్ ఉన్నా.. జరిగిన ఒకే ఒక్క నెగటివ్ పైనే అందరి ఫోకస్ పడుతుంది. సో.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ అన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సినీ ఇండస్ట్రీ అన్నాక హీరోయిన్స్ గ్లామర్ షో చేయడం మామూలే. అలాగని చేయాల్సిన అవసరం లేకపోయినా హడావిడి చేసేవారు కొందరుంటారు. అయితే.. సినిమా అవసరాన్ని బట్టి.. స్కిన్ షో, రొమాంటిక్ సీన్స్ చేయడం వరకు ఓకే. కానీ.. అవకాశాల కోసమే టాప్ టు బాటమ్ స్కిన్ షో అంటే ఖచ్చితంగా చర్చలకు దారితీస్తుంది.
సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ అందాలను భూతద్దం పెట్టినట్లుగా జూమ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారని.. అలాంటివి పట్టించుకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉండలేమని అంటోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. తమిళ బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ‘మీకు మాత్రమే చెప్తా’ అనే మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది. ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకురాకపోవడంతో.. మళ్లీ తమిళ ఇండస్ట్రీలోనే బిజీ అయ్యింది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోయినా.. వాణి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది. ఆ మధ్య సినీ అవకాశాల కోసం గ్లామర్ షో చేయడంలో తప్పేముందని షాకిచ్చింది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా వాణి.. ‘సెంగలం’ అనే తమిళ వెబ్ సిరీస్ లో పొలిటిషన్ క్యారెక్టర్ పోషించింది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ చేయలేదని.. ఈ జర్నీ చాలా కొత్తగా ఉందని చెప్పింది. అయితే.. సిరీస్ లో వాణి రోల్ కి పాజిటివ్ రియాక్షన్స్ తో పాటు నెటిజన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయట. ఒకప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ కి భయపడ్డా. కానీ, ఇప్పుడు అలా కాదని అంటోంది. అయితే.. సెలబ్రిటీలు ఏ ఈవెంట్ లో పాల్గొన్నా.. వారు డ్రెస్ సరిచేసుకున్నా వీడియోలు తీసి.. జూమ్ చేసి పోస్టులు పెడుతున్నారు. అలాంటివి పట్టించుకోకపోతే హ్యాపీగా ఉండలేమని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక తాను కూడా కెరీర్ లో ఆటుపోట్లు చూశానని చెప్పుకొచ్చింది వాణి భోజన్. ప్రస్తుతం అమ్మడి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో.. వాణి భోజన్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.