దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో సామాన్యులు నుంచి సెలబ్రెటీలు ప్రాణాలో కోల్పోతున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందినవారు రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు డ్రైవింగ్ పై పూర్తి అవగాహన లేని వాళ్లు సైతం రోడ్లపై వాహనాలు నడపడంతో అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది అమాయకులు కన్నుమూస్తున్నారు. ఇటీవల సినీ సెలబ్రెటీలు పలు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలు కావడం.. కన్నుమూయడం జరుగుతుంది. తాజాగా బుల్లితెర నటి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ బుల్లితెర నటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మే 23వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో టీవీ నటి వైభవి ఉపాధ్యాయ(32) కన్నుమూసింది. వైభవి తన బాయ్ ఫ్రెండ్ తో ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. వైభవి ఉపాధ్యాయ పాపులర్ టీవి షో ‘సారాబాయ్ వర్సెస్ సారాభాయ్’ లో జాస్మిన్ పాత్ర పోషించింది మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఈ షో ప్రొడ్యూసర్ జేడీ మజీతియా నటి వైభవి ఉపాధ్యాయ మృతిని కన్ఫర్మ్ చేశారు. వైభవి ఉపాధ్యాయకి మొదటి నుంచి నటనపై మక్కువతో టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ముంబాయిలో నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
బుల్లితెరపై తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న వైభవి ఉపాధ్యాయ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన ‘ఛపాక్’ మూవీలో నటించింది. ఈ మూవీతో వైభవి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైభవి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకునేది. వైభవి మరణవార్త గురించి తెలుసుకున్న బాలీవుడ్ సినీ, టెలివిజన్ ఇండస్ట్రీ ఒక్కసారే షాక్కు గురైంది. వైభవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు.