సాధారణంగా ఇండస్ట్రీలో పలానా హీరోతోనో, హీరోయిన్ తోనో నటించాలని నటీ, నటులకు కోరికలు ఉంటాయి. అయితే అవి సందర్భన్ని బట్టి బయటపెడుతుంటారు సదరు నటీ, నటులు. అయితే కొందరు స్టార్ హీరోలతో నటించాలని ఉందంటే.. మరికొందరేమో యంగ్ హీరోలతో జతకట్టాలని ఉందంటారు కొందరు భామలు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో బిజీగా ఉన్న చెన్నై సోయగం త్రిష.. ఆ స్టార్ హీరోతో కలిసి యాక్ట్ చేయాలని ఉన్నట్లు పేర్కొంది. అది తన జీవితంలో గొప్ప విషయంగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే త్రిష నటించిన చిత్రం ‘రాంగీ’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.
త్రిష.. తనతోపాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ లు అందరు దాదాపుగా కనుమరుగు అవుతున్న వేళ.. తన తరగని అందంతో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది ఈ చెన్నై సోయగం. పొన్నియిన్ సెల్వన్ 1 తో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టింది త్రిష. అంతే కాకుండా ఈ సినిమాలో కుందవై పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక తాజాగా త్రిష నటించిన చిత్రం ‘రాంగీ’ కోసం ఎంతో కష్టపడింది. డూప్ లేకుండా ఫైట్స్ చేసి, యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపింది. ఇన్ని సంవత్సరాల సినీ ప్రయాణంలో తన కోరిక అలాగే మిగిలిపోయిందని తెలిపింది. అదేంటంటే..
సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించాలని ఉందని.. తన మనసులో మాటను బయటపెట్టింది ఈ చెన్నై సోయగం. రజినీకాంత్ కు జోడీగా నటించాలని ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇకపోతే రజినీతో గతంలో ‘పేట’ సినిమాలో నటించింది త్రిష. అయినప్పటికీ మరోసారి తనకు జంటగా నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. 2022 సంవత్సరం అద్భుతంగా గడిచింది అని చెప్పుకొచ్చారు త్రిష. మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషమని చెప్పుకొచ్చింది. ఇక పొన్నియిన్ సెల్వన్ 2 కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు త్రిష తెలిపారు. ఇక రజినీకాంత్ తో మరోసారి కలిసి నటించాలని ఉన్న కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.