సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లకు ఫ్యాన్స్ ఉండటం సర్వసాధారణమే. కానీ ఓ హీరోకి మరో హీరో ఫ్యాన్ గా ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక ఇలాగే హీరోయిన్స్ విషయంలో కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ తమ అభిమాన నటీమణులు ఎవరో చెప్పారు. ఇక తాజాగా తన అభిమాన హీరోయిన్ ఎవరో చెప్పుకొచ్చింది చెన్నై సోయగం త్రిష. తాజాగా ఈ అమ్మడు తాను నటించిన ‘రాంగి’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేసింది.
త్రిష.. వర్షం సినిమా వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలానే ఉంది. యంగ్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని తరగని అందం త్రిష సొంతం. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరం అయిన ఈ సోయగం తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తోంది. ఇటీవలే పాన్ ఇండియా లెవల్లో విడుదలైన పొన్నియిన్ సెల్వన్ 1లో నటించింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ అమ్మడుకు మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా త్రిష నటించిన ‘రాంగి’ అనే చిత్రం న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు కథను అందించడం విశేషం. ఇక రాంగి సినిమాని శరవణన్ తెరకెక్కించాడు. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర బృందం.
అందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని ఓ అభిమాని అడగ్గా.. మోహమాటమే లేకుండా ఠక్కున్న హీరోయిన్ ‘అనుష్క’ అని చెప్పింది. అలా చెప్పడంతో అక్కడున్న వారందరు ఆశ్చర్యపోయారు. చాలా వరకు హీరోయిన్లకు, హీరోయిన్లకు మధ్య ఈగోలు ఉంటాయని అంటుంటారు. కానీ త్రిష మాత్రం తడుముకోకుండా అనుష్క పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక త్రిష తెలుగు చిత్రం చేసి దాదాపు 7 సంవత్సరాలకు పైగానే అవుతోంది. 2015లో బాలకృష్ణ నటించిన లయన్ చిత్రమే త్రిష తెలుగులో చివరి చిత్రంగా నిలిచింది. ఇక త్రిష తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.