అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోయింది ఈ బ్యూటీ. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా త్రిష ఓ వెలుగు వెలిగారు. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్నాళ్ల పాటు సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా త్రిష కొనసాగింది. అయితే గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లేక సతమతం అయ్యింది. తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమాతో కమ్ బ్యాక్ అయ్యిందనే చెప్పాలి. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈక్రమంలో త్రిష మరో లక్కీ చాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఇద్దరు తమిళ స్టార్ హీరోల సరసన నటించనున్నట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తోన్నాయి.
మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న త్రిష..గత కొంతకాలం నుంచి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతుంది. ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోలకు హీరోయిన్ అంటే ఫస్ట్ ఛాయిస్ గా త్రిష ఉండేది. అంతలా సౌత్ లోని అన్ని భాషల్లో నటించి టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆమెకు కుర్రాళ్లలో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే గత కొన్నాళ్ల నుంచి సినిమాల్లో అరుదుగా కనిపిస్తూ వస్తుంది. వాటితో అంతపెద్దగా గుర్తింపు దక్కడం లేదు. మంచి సక్సెస్ లేక సతమతం అయ్యింది. అయితే తాజాగా పొన్నియిన్ సెల్వన్ మూవీతో ఈ అమ్మడు రీఛార్జీ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమాలో కుందవై యువరాణిగా ఎంతో హుందాగా నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ది రోడ్’ అనే హీరోయిన్ ప్రాధానత్య ఉన్న సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో త్రిష మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తోన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ ల రాబోయే చిత్రాల్లో త్రిష హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. విజయ్ సరసన గిల్లీ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన త్రిష..తాజాగా మరోసారి ఆయనతో జత కట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ 67 సినిమాలో కథానాయకిగా త్రిష నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోకవైపు అజిత్ 62వ చిత్రంలో కూడా త్రిషను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.