చిత్రపరిశ్రమలో కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓపెన్ గా మాట్లాడుతుండటం చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ లో మొదలైన ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం.. ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలోను మొదట్లో సంచలనం రేపింది. కెరీర్ లో కొన్నాళ్లపాటు సైలెంట్ గా లైఫ్ లీడ్ చేసిన నటీమణులు ఎంతోమంది బయటికి వచ్చి బహిరంగంగా తమకు జరిగిన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికి ఏదొక చోట హీరోయిన్స్, సైడ్ ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ తో పాటు వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు కూడా మీడియాతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరాఠీ హీరోయిన్ తేజస్విని పండిట్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
తనకు జరిగిన సంఘటన గురించి తేజస్విని మాట్లాడుతూ.. హీరోయిన్స్ కి ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయని చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో ఫేస్ చేసిన చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. “2009-10లో పుణెలోని ఓ అపార్టుమెంట్ లో అద్దెకు ఉండేదాన్ని. ఆ టైంలో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. నేనుండే అపార్ట్ మెంట్ ఓ కార్పొరేటర్‌ది. ఓసారి రెంట్ కడదామని అతని ఆఫీస్ కి వెళ్లాను. అప్పుడాయన నన్ను రెంట్ వద్దు.. ఫేవర్ కావాలని డైరెక్ట్ గా అడిగేశాడు. అద్దె డబ్బులు వద్దుగాని తనతో గడపాలని అన్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ తర్వాత ఏమైందని అడగ్గా.. ‘ఆ అపార్టుమెంట్ ఓనర్ నాతో అలా అనగానే బాధేసింది. వెంటనే ఎదురుగా టేబుల్ పై గ్లాస్ లో ఉన్న వాటర్ ని అతని ముఖంపై కొట్టేశాను. నేను అలాంటి పనులు చేయడానికి ఈ యాక్టింగ్ కెరీర్ ఎంచుకోలేదని.. అలా తప్పుగా అనుకుంటే నీ అపార్టుమెంట్ లో ఉండే అవసరం నాకు లేదని అరిచేశాను” అని చెప్పుకొచ్చింది తేజస్విని. ప్రస్తుతం తేజస్విని మాటలు సోషల్ మీడియాలో, బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరాఠీలో ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించిన తేజస్విని.. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి నటి తేజస్విని లైఫ్ లో జరిగిన చేదు అనుభవంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.