తాప్సీ పన్ను.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన ఝమ్మంది నాదం సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ.. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలానే తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా నటించి.. మంచి గుర్తింపు సంపాదించింది. అయితే ఇటీవల ఈ అమ్మడు వివాదలతో వార్తలో నిలుస్తుంది. గతంలో మీడియా సమావేశంలో విలేకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికి తెలిసింది. ఆ సమయంలో తాప్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా తాప్సీ స్పందించారు. కొందరిలా కెమెరాల ముందు నటించడం తనకు రాదంటూ తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది.
గతంలో “దోబారా”ప్రమోషన్ లో భాగంగా మీడియాపై ఈ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఫైర్ అయ్యింది. ఆ సమయంలో నెటిజన్లు మీ సినిమాను బాయ్ కాట్ చేస్తామంటున్నారని మీడియా వారు అడిగారు. ‘మీరు చెప్పండి ఏ సినిమా బాయ్ కాట్ ఎదుర్కోవడం లేదో చెప్పండి’ అంటూ తాప్సీ విలేకర్లపై ఫైర్ అయింది. అంతేకాక ప్రశ్న అడిగే ముందు అన్ని ఆలోచించండి అంటూ వారిపై మండిపడింది. దీంతో ఈ వార్త మరోసటి రోజు తెగ వైరల్ అయింది. తాప్సీ మీడియాపై ఫైర్ అయిన వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో చేశారు. అయితే కాక ఈ అమ్మడిపై పలువురు విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై తాప్సీ వివరణ ఇచ్చారు. ఈ మధ్యన తాను జర్నలిస్ట్ లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చాలా వీడియోస్ ని వైరల్ చేశారని తెలిపింది. అయితే తనకు కొందరి మాదిరిగా కెమెరా ముందు ఒకలా, బయట ఓ లాగా నటించడం చేతకాదని, ఉన్నది ఉన్నట్టు, అనుకున్నది అనుకున్నట్టుగా మట్లాడేస్తానని తెలిపారు. ఇంకా తాప్సీ మాట్లాడుతూ.. “నేను విలేకర్లపై సీరియస్ అయిన వీడియోలు చూసి చాలా మంది నాపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలోనూ ఇష్టం వచ్చినట్లు నిందలు వేశారు. వాళ్ల మాటలకు నేను ఎంతో బాధపడ్డాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావించాను. అంతేకాక నాపై వచ్చే వార్తలను చూడకూడదని నిర్ణయించుకున్న.
నాకు నచ్చినట్లు ఉంటా.. ఎక్కడైనా నా మనస్సుకు నచ్చింది అనిపిస్తే మనస్పూర్తిగా మాట్లాడతా. సమాజంలో మంచి మార్కులు కొట్టేయడానికి కొంతమంది స్టార్స్ బయట నటిస్తుంటారు. అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు. నటిగా నా పనిని అందరు మెచ్చుకుంటే చాలు” అని తాప్పీ తెలిపారు. ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ‘బ్లర్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. వచ్చే ఏడాది కొన్ని భారీ ప్రాజెక్ట్ సినిమాలతో బిజీగా మారనుంది. ప్రస్తుతం ఆమె.. షారుఖాన్ తో కలిసి ‘డుంకీ’ సినిమాలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ అమ్మడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. తనపై వచ్చిన విమర్శలకు తాప్సీ ఇచ్చిన సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.