టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సురేఖావాణి.. ఈ మధ్యకాలంలో మాత్రం సినిమాల్లో అడపాదడపానే కనిపిస్తున్నారు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ట్రెండ్ కి తగ్గట్టుగా కూతురితో పాటు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది. ఇక సురేఖ కూతురు సుప్రితకి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా.. వీరిద్దరూ థాయ్‌లాండ్ టూర్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సురేఖ కూతురు సుప్రిత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సురేఖ, సుప్రిత అప్పట్లో వెకేషన్ టూర్స్ కి బాగానే వెళ్లేవారు. కానీ.., కరోనా నేపథ్యంలో గత రెండేళ్ల నుండి వీరు వెకేషన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కరోనా కేసులు అదుపులోకి రావడంతో సురేఖ, సుప్రిత ఎంచక్కా బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని థాయ్‌లాండ్ చెక్కేశారు. ఇక ఫ్లైట్‌లో ఈ తల్లీకూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మందు గ్లాసుతో చీర్స్ చెబుతూ ఈ ఇద్దరూ కనిపించారు. ఇక సుప్రిత అయితే.. అక్కడ తాను చేయించుకున్న థాయ్ మసాజ్ ఫోటోలను కూడా షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఏదేమైనా.. సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్న ఈ మోడ్రన్ తల్లీకూతుళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.