క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధాకి తెలుగునాట పరిచయం అవసరం లేదు. ఏకంగా 900లకు పైగా చిత్రాల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆమెది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు సుధ. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వ్యక్తిగత జీవితంలో ఆమె చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని బాధని బయట పెట్టారు సుధ.
ఇవి కూడా చూడండి:
రేషన్ షాపుల ద్వార గ్యాస్ సిలిండర్లు.. కేవలం 350 రూపాయలు
మెగాస్టార్ చిరంజీవి తల్లికి క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డి
నా భర్త అమెరికాలో తన లైఫ్ తాను బతుకుతున్నాడు. నా కొడుకు కూడా అంతే. నన్ను పట్టించుకోవడం మానేశాడు. వాళ్ళు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోవడం నాకేమి బాధగా అనిపించడం లేదు. కానీ.., అన్నీ కష్ట సమయాల్లో తోడుగా ఉన్న నా తండ్రి మరణమే నన్ను బాధిస్తోంది. నన్ను ఒంటరిగా వదిలేసిన వారికి రేపటి రోజున నా పరిస్థితే వస్తుంది. నా విలువ వారికి అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం నా కూతురు, మనవరాలితో ఆనందంగా ఉంటున్నాను అని సుధ ఎమోషనల్ అయ్యారు. తెరపై తల్లిగా, భార్యగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన సుధాకి నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా విచారకరం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.