సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారు.. హీరోయిన్ లుగానే తమ కెరీర్ లను కొనసాగిస్తారు. కానీ రోజులు మారుతున్న కొద్ది హీరోయిన్ ల ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. కేవలం హీరోయిన్ లుగానే కాకుండా ఇటు ఐటెమ్ సాంగ్ లతో, అటు స్పెషల్ సాంగ్ ల్లో మెరుస్తూ.. రెండు చేతుల్తో సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్య మరికొంత మంది హీరోయిన్ లు వీడియో సాంగ్ లతో యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నారు. తాజాగా వీడుదలైన ‘ఐ లవ్ యూ ఇడియట్’ వీడియో సాంగ్ లో తన అందచందాలతో మత్తెక్కించింది యంగ్ బ్యూటీ శ్రీలీల. టాప్ తీసేస్తూ.. కుర్రకారు గుండెలకు గాయం చేస్తోంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ సాంగ్.
హీరోయిన్ శ్రీలీల.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన చిత్రం ‘పెళ్లి సందడి’. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ విదేశీ సోయగం. అమెరికాలో పుట్టిన శ్రీలీల.. భారత సంతతికి చెందినది. చిన్నతం నుంచే సినిమాలపై ఇష్టంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తన అందచందాలతో కుర్రాళ్ల మనసు దోచింది. దాంతో వరుసగా సినిమా అవకాశాలు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అటు కన్నడలో ఇటు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉంది. ఈ క్రమంలోనే శ్రీలీల నటించిన ఓ వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
అర్జున్ డైరెక్షన్ లో ‘I Love You Idiot’ అనే వీడియో సాంగ్ ను చేశారు. దాంట్లో విరాట్ సరసన ఆడిపాడింది శ్రీలీల. టామ్ అండ్ జెర్రీలా సాగే ”పిల్లా పిల్లగా” సాంగ్ లో ఎంతో ముద్దుగా కనిపించింది శ్రీలీల. ఇక ఈ సాంగ్ లో తన అందచందాలతో కుర్రకారుకు మత్తెక్కించింది. టాప్ తీసేసి హాట్ హాట్ అందాలతో.. చలికాలంలో వేడిపుట్టిస్తోంది. ఈ పాటలో తనలో ఉన్న మాస్ డ్యాన్స్ ను సైతం బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం శ్రీలీల.. మాస్ మహారాజ్ రవితేజ సరసన ‘ధమాక’ మూవీలో మెరవనుంది. దానితోపాటు మరికొన్నిటాలీవుడ్ చిత్రాలకు సైన్ చేసింది. కన్నడంలో కూడా వరుస చిత్రాలు చేస్తు ప్రేక్షకులను అరిస్తోంది శ్రీలీల. తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది బ్యూటీ శ్రీలీల.