ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఇకపై అలాంటి సీన్లనో నటించనని తేల్చి చెబుతున్నారంట.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయారు శ్రీలీల. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. అందం, అభినయంతో పాటు హై ఎనర్జీతో ప్రేక్షకుల చూపుల్ని తిప్పుకోకుండా చేస్తున్నారు. ఇక, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 5 సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ఐదు సినిమాలు శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల తల్లికి ఇచ్చిన మాటకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమాల విషయంలో శ్రీలీల తన తల్లికి ఓ మాట ఇచ్చారట. శ్రీలీల తన సినిమాల్లో ఎలాంటి రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించనని తల్లికి మాటిచ్చారట. శ్రీలీల గతంలో నటించిన కొన్ని సన్నివేశాలను చూసి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారట. ఈ విషయం శ్రీలీల తల్లి వరకు వెళ్లింది. ఆమె నెటిజన్ల ట్రోలింగ్స్‌పై చాలా బాధపడ్డారంట. చిన్న వయసులోనే ఇలా ట్రోలింగ్స్ మొదలైతే.. భవిష్యత్తులో అవి ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆమె భావించారట.
ఇకపై రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించవద్దని ఆమె శ్రీలీలను కోరారంట. శ్రీలీల తన తల్లి మాటలకు ఓకే చెప్పారంట. ఇకపై అభ్యంతరక సన్నివేశాల్లో నటించనని తేల్చిచెప్పారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తల్లికి ఇచ్చిన మాట కోసం కొన్ని ఆఫర్లను కూడా ఆమె వదులుకున్నట్లు సమాచారం. మరి, తల్లికిచ్చిన మాట కోసం రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లకు శ్రీలీల గుడ్‌బై చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.