చిత్రపరిశ్రమకి సంబంధించి సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించి పబ్లిక్ లో ఎంత ప్రచారం చేసినా.. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అంత ఈజీగా బయట పెట్టలేరు. ముఖ్యంగా ఎవరితోనైనా ప్రేమలో పడ్డారంటే చాలు.. మీడియాకి మరింత దూరంగా ఉండాలని, మీడియాలో ఈ విషయం స్ప్రెడ్ అవ్వకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. సెలబ్రిటీలు కదా.. ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.. సో లవ్ మ్యాటర్ అయినా, ఇంకా వేరేదైనా విషయం మాత్రం బయటికి రాకమానదు. సో.. దాచినా దాగని విషయాలను దాచాలని అనుకున్నా లాభం లేదు. రీసెంట్ ఓ హీరోయిన్ విషయంలో అదే జరిగింది.
హీరోయిన్స్ కి సంబంధించి ఏ విషయమైనా ఇట్టే ఇండస్ట్రీ అంతా పాకేస్తుంది. అలాంటిది ఓ హీరోయిన్ తన లవ్ మ్యాటర్ ని ఏకంగా నాలుగైదేళ్ల నుండి సీక్రెట్ గా నడిపిస్తుందట. దీంతో ఇన్నేళ్ళపాటు ఎలా ఈ విషయాన్ని బయటికి రాకుండా మెయింటైన్ చేయగలిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్? అనుకుంటున్నారా.. రండి వివరాల్లోకి వెళ్దాం. బాలీవుడ్ హీరోయిన్ సోనాలి సెహగల్.. ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియా గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్యార్ కా పంచనామా, వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2 లాంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది సోనాలి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఈ క్రమంలో సోనాలి లవ్, డేటింగ్ అంటూ కొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి. అయితే.. కలకత్తాకి చెందిన సోనాలి.. దాదాపు పదేళ్లకు పైగా బాలీవుడ్ లో కొనసాగుతోంది. అయితే.. సోనాలి నాలుగైదేళ్లుగా అశేష్ ఎల్. సజ్నాని అనే వ్యాపారవేత్తతో లవ్ లో ఉందట. ఈ విషయాన్నీ తాను చెప్పలేదు.. ఎలాగోగాని మొత్తానికి బయటికి వచ్చేసింది. ఇద్దరూ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటున్నారు.. కానీ, ఇంతవరకు ఒకరి ఫోటో ఒకరు పోస్ట్ చేయలేదు. అలాగే ఎక్కడా పబ్లిక్ ప్లేస్ లో కూడా కలుసుకున్నట్లుగా కనిపించలేదు. మరి వీరి లవ్ నిజమా? లేక రూమర్స్ వరకేనా అనేది వీరిద్దరే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సోనాలి ప్రస్తుతం బ్లాక్ కరెన్సీ, బూందీ రైతా అనే సినిమాలలో నటిస్తోంది. మరి సోనాలి సెహగల్ సీక్రెట్ లవ్ రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.