32 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది అలనాటి స్టార్ హీరోయిన్. ఈ క్రమంలోనే తన జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. 19 సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది మెగాస్టార్ తో నటించిన స్టార్ హీరోయిన్.
చిత్ర పరిశ్రమలో ఏ హీరోకైనా, హీరోయిన్ కైనా ఒక ఏజ్ అంటూ వచ్చాక సినిమాలు తగ్గిపోవడం అనేది సహజంగానే జరిగే ప్రక్రియ. మరీ ముఖ్యంగా హీరోయిన్ ల కెరీర్ విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే 32 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది అలనాటి స్టార్ హీరోయిన్. ఈ క్రమంలోనే తన జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. 19 సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ సోనమ్. త్రిదేవ్, విశ్వాత్మ, అజూబా లాంటి సినిమాలతో మంచి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో తెలీదు కాని అర్ధంతరంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది సోనమ్. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, సినిమాలు వదిలేయడానికి కారణాలు, వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. కరోనా సమయంలో నేను ఓటీటీల్లో చాలా షోలు, వెబ్ సిరీస్ లు చూశాను. అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను నేనెందుకు ఇలాంటి సిరీస్ లు, షోలు చేయకూడదు అని సోనమ్ చెప్పుకొచ్చారు.
దాంతో వెంటనే తన శరీర ఆకృతిపై దృష్టి పెట్టి, 30 కిలోలు తగ్గినట్లు సోనమ్ తెలిపింది. ఇక దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక 1997లో ఇండియాను వదిలి వెళ్లిపోయాను అని, తాను 14 సంవత్సరాలకే పని చేయడం ప్రారంభించినట్లు ఈ సందర్భంగా సోనమ్ తెలిపింది. ఇక తన జీవితంలో కష్ట సుఖాలను అన్నీ చూశానని అన్నారు. అదీకాక 19వ ఏటనే గర్భం దాల్చాను అని షాకింగ్ విషయన్ని వెల్లడించింది. లైఫ్ అన్నాక అన్నింటిని దాటుకుని ముందుకు పోవడమే జీవితం అని సోనమ్ అన్నారు.
ఇక ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో సోనమ్ నటించనుంది. మంచి కథ దొరికితే కథకు తగ్గట్లుగా నా శరీరాన్ని మార్చుకోవడానికి సిద్దం అని ఆమె పేర్కొన్నారు. నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు అని, అంతమాత్రానికే నాకు వయసై పోలేదని సోనమ్ చెప్పుకొచ్చింది. సోనమ్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమాలో నటించి మెప్పించింది. మరి 32 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.