ఈమె ప్రముఖ నటి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్లామర్ కూడా పెంచుకుంటూనే ఉంది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా క్రేజ్ మాత్రం బోలెడంత తెచ్చుకుంది. ఆమె ఎవరో కనిపెట్టారా?
యాక్టర్స్‌కి ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడ పుట్టి పెరిగినా సరే అవకాశామొస్తే ఏ భాషలో నటించడానికైనా రెడీ అయిపోతారు. ఈ ముద్దుగుమ్మ కూడా అలా కెరీర్ స్టార్టింగ్ లో తెలుగులో ఓ రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఈ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఛాన్స్ రాలేదో లేదంటే వద్దనుకుందో ఆమెకే తెలియాలి. ఏదైతేనేం ప్రేక్షకుల మైండ్ లో రిజస్టర్ అయిపోయింది. ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో మనోళ్లని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్ని చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ముద్దుగుమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా పరిచయమైంది ఈ భామ. వెంకటేష్ ‘బాబు బంగారం’, సుశాంత్ ‘ఆటాడుకుందాం రా’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లు చేసింది. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యేసరికి తెలుగులో పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో సొంత ఇండస్ట్రీ పంజాబీకి వెళ్లిపోయింది. హిందీలో ఒకటి రెండు మూవీస్ చేసింది గానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 20కి పైగా పంజాబీ చిత్రాల్లో నటించింది.
సరే సినిమాలు గురించి పక్కనబెడితే తన హాట్ హాట్ ఫొటోషూట్స్, వీడియోలతో తెలుగు నెటిజన్స్ ని ఈమె ఎట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈ బ్యూటీ ఫొటో, వీడియో ఏం పోస్ట్ చేసినా ఆదరించే ఆడియెన్స్ మన తెలుగు ప్రేక్షకులు. అలా టాలీవుడ్ లో జస్ట్ రెండు చిత్రాలే చేసినప్పటికీ క్రేజ్ మాత్రం బోలెడంత సొంతం చేసుకుంది. మన దగ్గర పెద్దగా సినిమాలు ఏం చేయకపోయినా సరే ఆకట్టుకుంటూనే ఉంది. సో అదనమాట విషయం. మరి ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎవరైనా గుర్తుపట్టారా? ఒకవేళ ఐడియా వచ్చి గుర్తుపడితే మాత్రం కింద కామెంట్ చేయండి.