ఇండస్ట్రీలో రాణించాలి అంటే.. అందంతో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. ఇక పరిశ్రమలో పేరొచ్చేదాక నటీ, నటులు ఎన్నో కష్టాలు పడాల్సిందే. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం తిరిగే టైమ్ లో ఎన్నో బాధలను, చీత్కారాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాంటి చీత్కారాలనే ఎదుర్కొన్నాను అంటోంది తెలుగు హీరోయిన్. అందంగా లేనని అవకాశాలు ఇవ్వనన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
శోభిత ధూలిపాళ్ల.. గూఢాచారి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టింది. ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా మారింది ఈ సుందరి. తాజాగా తన కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ..”నేను అందంగా లేను అని నాకు అవకాశాలు ఇవ్వలేదు. 20 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఓ షాంపు కంపెనీకి ప్రకటన కోసం వెళ్లాను. ఆ టైమ్ లో నన్ను బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికి రావు అని అన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అయ్యా” అని చెప్పుకొచ్చింది శోభిత.