సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. కానీ పైకి ఎంతో అందగా కనపడే ఈ రంగుల వెనుక కనిపించని మరకలూ ఉన్నాయనే సంగతి తెలిసిందే. చాలా మంది యువతి యువకులు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వారికి అవకాశాలు రావడం అంత తేలికైన విషయం కాదు. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే తప్పనిసరిగా దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. సినిమా పరిశ్రమలో కమిట్మెంట్ గురించి ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్ సినిమా హీరోయిన్ స్నేహా శర్మ.. పరిశ్రమలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడింది.
సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ స్థాయిలో ఉన్న వారి నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి అనుభవాలను చెప్పుకున్నారు. తాజాగా హీరోయిన్ నేహా శర్మ తన అనుభవాలను వివరించింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూ పాల్గొంది. స్నేహా శర్మ మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను. కమిట్ మెంట్ అడిగారు. దానికి నేను నో చెప్పినందుకు సినిమాలోంచి తీసేశారు. కేవలం నేను నో చెప్పడం వలన పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కోల్పోయాను.
అవకాశాలు కోల్పోయినప్పటికీ అడుక్కు తినైనా బ్రతుకుతా కానీ అలాంటి పనులు చేయను. అయినా ఈ పరిశ్రమలో బలవంతాలు ఉండవు. మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అడిగేవాళ్లు అడుగుతారు. నిర్ణయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది” అని నేహాశర్మ తనకు ఎదురైన అనుభవాల గురించి షేర్ చేసుకుంది. మరి.. నేహా శర్మ చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.