సీనియర్ నటి సీత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ప్రస్తుతం తల్లి, అత్త క్యారెక్టర్లు చేస్తూ.. సినిమాల్లో బిజీగా రాణిస్తుంది సీత. సినిమాలు తప్ప.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ఎలాంటి వార్తలు కనిపించవు. కానీ తాజాగా సీత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన వ్యక్తిగత జీవితం గురించి నటి చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆమె భర్త గురించే అని అర్థం అవుతోంది. ఇంతకు సీత భర్త ఎవరు.. ప్రస్తుతం వారు కలిసే ఉన్నారా.. ఎందుకు సీత భర్త గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో తెలియాలంటే..
సీత.. పాండ్యరాజన్ దర్శకుడిగా, హీరోగా.. పరిచయం అయిన ఆన్‌పావం చిత్రం ద్వారా.. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే.. ఆమె మంచి నటిగా.. పక్కింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం.. తదితర భాషల్లో… అవకాశాలు దక్కించుకుని.. హీరోయిన్‌గా రాణించింది. ఈ క్రమంలో దర్శకుడు భాగ్యరాజ్ శిష్యుడు పార్తీపన్‌తో సీతకు పరిచయం ఏర్పడింది. పార్తీపన్.. తొలిసారిగా.. స్వీయ దర్శకత్వంలో.. హీరోగా పుదియపాదై.. సినిమాలో సీత హీరోయిన్‌గా నటించింది.
ఆ సినిమా షూటింట్ సందర్భంగా ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. 1990లో వీరి వివాహం జరిగింది. ఇక వీరికి ముగ్గురు సంతానం. అయితే మనస్పర్థల కారణంగా.. పదకొండేళ్ల తర్వాత అనగా.. 2001లో విడిపోయారు. అప్పటి నుంచి వీరు విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత 43 ఏళ్ల వయసులో సీత.. బుల్లితెర నటుడు సతీష్‌ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. కొన్ని ఏళ్ల తర్వాత.. వీరిద్దరూ విడిపోయారు.
ఈ క్రమంలో తాజాగా సీత మొదటి భర్త.. ఆమె మీద సంచలన ఆరోపణలు చేశాడు. తామిద్దరం విడిపోవడానికి సీత అత్యాశే కారణం అని ఆరోపించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే భర్త చేసిన వ్యాఖ్యలపై సీత స్పందించింది. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఓ సినిమాలో చెప్పినట్లు.. నా భర్త నాకే సొంతం అనుకునే సగటు మహిళను నేను. అది తప్పు కాదు కదా. పార్తీపన్ చెప్పినవన్నీ అసత్యాలే అన్నది సీత. ప్రస్తుతం ఈ దంపతుల వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో వైరల్‌గా మారాయి. మరి సీత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.