కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ అనేవి అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతోమంది హీరోయిన్లు, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు మీటూ వివాదం ద్వారా ఇండస్ట్రీలో ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేస్తూ వస్తున్నారు. ఇన్నేళ్ళైనా పరిశ్రమలో అమ్మాయిలు, లేడీ ఆర్టిస్టులు.. ముఖ్యంగా తెలుగు ఆర్టిస్టులు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలుస్తోంది. అవకాశాల పేరుతో దర్శకనిర్మాతలు తమను మోసం చేశారని, శారీరకంగా వాడుకున్నారని ఇప్పటివరకు ఎంతోమంది ఆర్టిస్టులు కెమెరా ముందుకు వచ్చి నిర్భయంగా మాట్లాడారు. కొంతమంది ఏకంగా తమను మోసం చేసిన వారి పేర్లను కూడా బయట పెట్టిన సందర్భాలున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మరో తెలుగు నటి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ నటి శిరీష గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ.. నటిగా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి కొంతకాలంగా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతోంది. ఈ విషయాన్ని నటి శిరీషే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో వెల్లడించింది. అయితే.. సినిమాలపై ప్యాషన్ తో రాజమండ్రి నుండి ఇండస్ట్రీకి వచ్చిన శిరీష.. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలుపడి అవకాశాలు దక్కించుకున్నట్లు తెలిపింది. అలాగే అవకాశాల కోసం ఎన్నోసార్లు దర్శకనిర్మాతల కమిట్మెంట్స్ కి లొంగిపోయానని ఆమె చెప్పడం గమనార్హం.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇంకా ఉంది.. ఈ కాస్టింగ్ కౌచ్ బారినపడి కెరీర్స్ కోల్పోయిన వారున్నారు.. అవకాశాల కోసం కమిట్మెంట్స్ కి లొంగిపోయిన వారుకూడా ఉన్నారు. కానీ.. లైఫ్ లో ఈ రెండింటి బారినపడి కెరీర్ ని నాశనం చేసుకున్న వారిలో నటి శిరీష ఒకరు. ఈ మధ్య అందరూ కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ పై ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. అలా రీసెంట్ గా తాను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్స్ గురించి శిరీష మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతల కమిట్మెంట్స్ కి లొంగిపోయి లైఫ్ నాశనం చేసుకున్నానని చెబుతూ ఎమోషనల్ అయ్యింది శిరీష.
ఆమె మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో 10వ తరగతి వరకు చదువుకొని.. సినిమాల మీద పిచ్చితో ఇంట్లో చెప్పాపెట్టకుండా హైదరాబాద్ కి వచ్చేశాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఒకరు జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తుంటే.. ఆమెతో కలిసి ఇండస్ట్రీ వాళ్ళను పరిచయం చేసుకున్నాను. అప్పట్లో నాకు డాన్స్ రాదు. ఓ డాన్స్ మాస్టర్ పరిచయమైతే.. ఆయన ద్వారా ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ లభించింది. అలా ఓవైపు సినిమాలలో చిన్నాచితకా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూనే.. ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చాను. ఆ మధ్యలో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేశాను. కానీ.. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశాలు రాలేదు. పలు సీరియల్స్ లో కూడా చిన్న రోల్స్ చేశాను.
ఇన్ని చేసినా.. కొంతకాలంగా నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు. ఎంతోమంది నన్ను అవకాశాలు ఇస్తామని చెప్పి.. శారీరకంగా వాడుకున్నారు. కమిట్మెంట్స్ ఇచ్చి.. పడుకున్నాక కూడా అవకాశాలు ఇవ్వకుండా మోసం చేసిన వారున్నారు. క్యారెక్టర్స్ తో పాటు ఐటమ్ సాంగ్స్ కూడా చేసిన నేను.. ఒకప్పుడు బిజీగా ఉండటంతో ఫైనాన్సియల్ గా లోన్స్ పై ఇల్లు, కారు తీసుకున్నాను. అవకాశాలు లేక అవన్నీ పోయాయి. ఇప్పుడు చేతిలో అవకాశాలు లేక రోడ్డు మీద పడినట్లయింది. అంతెందుకు సినిమా ఆర్టిస్ట్ అని చెప్పి రెంట్ కి ఇల్లు అడిగినా ఎవ్వరూ ఇవ్వడం లేదు.’ అని వాపోయింది నటి శిరీష. అలాగే తనకు ఇప్పుడైనా అవకాశాలు ఇస్తే బాగుంటుందని కోరింది. ప్రస్తుతం శిరీష మాటలు హాట్ టాపిక్ కాగా.. ఆమె పాత ఇంటర్వ్యూల వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.