దాదాపు 15 ఏళ్ల పాటు సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఈ నేపథ్యంలోనే 2003లో చిన్ననాటి మిత్రుడి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సిమ్రాన్ పెద్ద కుమారుడు అదీప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
1990-2000లలో సౌత్ సినిమాను ఓ ఊపు ఊపిన హీరోయిన్స్‌లో సిమ్రాన్ ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్నారు. టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. 2003లో ప్రముఖ వ్యాపారవేత్త, ఆమె చిన్ననాటి ఫ్రెండ్ దీపక్ బగ్గాను వివాహమాడారు. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు అదీప్ ఓదో, ఆదిత్ వీర్‌లు పుట్టారు. ప్రసుత్తం సిమ్రాన్ పెద్ద కొడుకు అదీప్ ఓదో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోలను బిహైండ్‌వుడ్స్ తమ అఫిషియల్ ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా.. అవి నెట్టింట చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటిపై స్వయంగా సిమ్రానే తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. బిహైండ్‌వుడ్స్‌కు కృతజ‍్క్షతలు తెలియజేశారు. ఇక, ఆ ఫొటోల్లో.. అదీప్ సోఫాలో కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. హీరోలకు పోటీ వచ్చే అందంతో అతడు చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. కాగా, పెళ్లి తర్వాత అమెరికా వెళ్లి పోయిన సిమ్రాన్ కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చారు. 2008లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సూర్య హీరోగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘వారనమ్ ఆయిరమ్’ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ‘అబ్బాయి గారి పెళ్లి’ తెలుగులో సిమ్రాన్ మొదటి సినిమా. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. 2008లో వచ్చిన ‘జాన్ అప్పారావు 40 ప్లస్’ ఆమె తెలుగులో చివరిగా నటించిన సినిమా. సిమ్రాన్ ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. మరి, హీరోలకు పోటీ వచ్చే అందంతో స్టైలిష్‌గా ఉన్న సిమ్రాన్ కుమారుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Guess Who’s This Dapper Looking Boy!! 🥺💜
Chill… Its Our Beloved Simran’s Cute Son #Adheep ❤️@SimranbaggaOffc #Simran pic.twitter.com/xfADyjk6Ko— Behindwoods (@behindwoods) April 10, 2023