ఈ చిన్నారి టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఓ ఎవర్ గ్రీన్ హిట్ మూవీలో హీరోయిన్ గా చేసింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా లేదా?
ఆమె తెలుగమ్మాయే. పుట్టి పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాద్ లోనే. సన్నని మెరుపుతీగలా ఉండే ఈ బ్యూటీ.. చూడటానికి అందాల కుందనపు బొమ్మలా ఉంటుంది. నవ్వితే నవరత్నాలు మెరిసినంత అందంగా కనిపిస్తుంది. చీర కడితే సూపర్.. మోడ్రన్ డ్రస్ వేస్తే బంపర్ అన్నంత హాట్ గానూ ఉంటుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. మిస్ ఆంధ్రా, మిస్ తెలంగాణ అవార్డులు కూడా దక్కించుకుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఈమెనే హీరోయిన్.. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తొచ్చిందా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు ‘ఈ నగరానికి ఏమైంది’లో విశ్వక్ సేన్ కు జోడీగా నటించిన హీరోయిన్. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన బ్యూటీ.. ఓవైపు చదువుతూనే మరోవైపు మోడలింగ్ కెరీర్ లో తన మార్క్ చూపించింది. 2012లో మిస్ ఆంధ్రా, టాలీవుడ్ మిస్ హైదరాబాద్ టైటిల్స్ గెలుచుకుంది. అలా 2014లో ‘హమ్ తుమ్’ సినిమాతో 18 ఏళ్ల వయసులోనే హీరోయిన్ అయిపోయింది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2017లో ‘ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ’గా నిలిచింది. ఈమె పేరే సిమ్రాన్ చౌదరి. అదే ఏడాది ఆడిషన్స్ లో పాల్గొని ‘ఈ నగరానికి ఏమైంది’ హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది.
ఇలా ఒక్క మూవీతో తన ఫ్యాన్ బేస్ ని పెంచేసుకున్న హీరోయిన్ సిమ్రాన్ చౌదరి.. ఆ తర్వాత ‘బొంభాట్’, ‘చెక్’, ‘పాగల్’, ‘సెహరి’ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడాయి. దీంతో సిమ్రాన్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. సినిమా ఛాన్సులు కూడా దక్కినట్లు కనిపించట్లేదు. ఈ క్రమంలోనే ఇన్ స్టాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఛాన్సుల కోసం తెగ ప్రయత్నిస్తోంది. కానీ ఆమెని ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించట్లేదు. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది కనిపెట్టారు. కింద కామెంట్ చేయండి.