ఇప్పుడు హీరోయిన్లు క్రేజ్ కోసం నానా తంటాలు పడుతున్నారు. కానీ ఆమె జస్ట్ అలా యాక్టింగ్, డ్యాన్స్, నడుముతో బీభత్సమైన ఫేమ్ సంపాదించింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో ఆమె తనదైన ముద్ర వేసింది. 1990ల్లో ఎక్కడ చూసినా ఆ హీరోయిన్ దే హవా. ఓ వైపు తెలుగు స్టార్ హీరోలతో, మరోవైపు తమిళ్ టాప్ హీరోలతో నటించేసింది. అందరికీ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇక దాదాపు ప్రతి హీరోతోనూ హిట్స్ కొట్టింది. చిరంజీవి, నాగార్జున, బాల కృష్ణ, వెంకటేష్ లాంటి టాప్ హీరోలకి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. తమిళంలో కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్యతోనూ యాక్ట్ చేసి వావ్ అనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించలేకపోయాననే వెలితి సెకండ్ ఇన్నింగ్స్ తో నెరవేర్చుకుంది. ఇంతా చెప్పాం కదా ఆ హీరోయిన్ ఎవరనేది కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఏ స్టార్ హీరోకు అయినా సరే అప్పట్లో ఆమె మొదటి ఛాయిస్. సౌత్ దాదాపు కొన్నేళ్లపాటు ఏకఛత్రాదిఫత్యం చూపించింది. రెమ్యూనరేషన్ కూడా స్టార్ హీరోలకు సమానంగా తీసుకుంది. హీరోయిన్లు కాస్త బొద్దుగా కనిపించే ఆ రోజుల్లో ఈమె మాత్రం తన ఫిజిక్ తో ప్రేక్షకులని ఫిదా చేసింది. ముఖ్యంగా జీరోసైజ్ నడుముతో చాలామందిని ఫ్లాట్ చేసింది. ఇంత క్రేజ్ ఉన్న ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పటి కుర్రాళ్ల కలలరాణి సిమ్రాన్. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి ఫొటో ఒకటి బయటకొచ్చింది. అది చూసిన నెటిజన్స్ కొందరు గుర్తుపడితే, మరికొందరు మాత్రం ఎవరా అని ఆలోచిస్తున్నారు.
ఈ బ్యూటీ కెరీర్ చూసుకుంటే.. పంజాబ్ లో పుట్టిన సిమ్రాన్ బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది ఫ్లాప్ అవడంతో సౌత్ ఇండస్ట్రీ వైపు వచ్చేసింది. తెలుగులో అబ్బాయిగారి పెళ్లి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమర సింహ రెడ్డి, నరసింహ నాయుడు, డాడీ, కలిసుందాం రా, నువ్వొస్తావని లాంటి హిట్ సినిమాలు చేసింది. 2003లో పెళ్లి చేసుకున్న సిమ్రాన్.. కొన్నేళ్లపాటు యాక్టింగ్ కు బ్రేక్ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, రజనీకాంత్ తో ‘పేటా’ సినిమాలో నటించింది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. సరే ఇదంతా పక్కనబెడితే సిమ్రాన్ చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.