భారతదేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో కేదార్ నాథ్ దేవాలయం ఒకటి. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రానికి రోజూ వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. వారిలో సినీ, రాజకీయ ప్రముఖుల సైతం ఉంటారు. కొన్ని రోజుల క్రితమే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో సహా ఉత్తరాఖండ్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి శోభన కేదార్ నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పొగమంచులో చిక్కుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు నటి శోభన.
సీనియర్ నటి శోభన.. 90వ దశకంలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అచ్చతెలుగు ఆడపడుచులా నటిస్తూ.. మన ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలిగా చేరిపోయారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలందరి సరసన నటించారు శోభన. గత కొంత కాలంగా సినీమాలకు దూరంగా ఉంటున్న ఈమె క్లాసికల్ డ్యాన్స్ ల క్లాస్ చెబుతూ బిజీగా ఉంటోంది. ఇక సమయం చిక్కినప్పుడల్లా దేవాలయానలు దర్శించుకోవడం శోభనకు అలవాటు. అందులో భాగంగానే తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కేదార్ నాథ్ దేవాలయాన్ని సందర్శించుకున్నారు శోభన. ఈ యాత్రలో భాగంగా శోభన అక్కడి వాతావరణం గురించి చెబుతూ ఓ వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.
అందులో “ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంది. పొగమంచు కారణంగా నాకు జలుబు చేసింది. పైగా దట్టమైన పొగకారణంగా హెలికాప్టర్ ఆలస్యం అయ్యిందని, దానికోసంమే ఎదురుచూస్తున్నానని” వణుకుతూ చెప్పుకొచ్చింది శోభన. ఇక ఇలా చెబుతుంటే నేను ఓ విలేకరిలా నాకు నేనే అనిపిస్తున్నాను అంటూ సరదాగా నవ్వేశారు. ఇక్కడి నుంచి ఇంటికి చేరగానే మరిన్ని విషయాలు అప్డేట్ చేస్తానంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభన షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే కేదార్ నాథ్ తీర్థయాత్ర ఎంత కఠినమైనదో మనందరకి తెలిసిందే. అక్కడి వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మేడం మీరు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.