సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మొదలయ్యాక ఎంతో మంది నటీమణులు, ఇతర రంగాలకు చెందిన వారు తమపై జరిగిన లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చారు.. తెస్తున్నారు. టాలీవుడ్ లో సైతం కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున రగడ మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ బ్యూటీలు రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ ఇద్దరి మద్య గొడవ చిలికి చిలికి గాలివానగా పోలీసుకుల ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. బాలీవుడ్ నటి రాకీ సావంత్ పై గ్లామర్ బ్యూటీ షెర్లిన్ చోప్రా పోలీసుకు ఫిర్యాదు చేసింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్, దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఇటీవల షెర్లిన్ చోప్రా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సాజిత్ ఖాన్ ఎంతో మంది యువతులను ఆడీషన్ సమయంలో లైంగికంగా వేధించాడని.. అతన్ని బిగ్ బాస్ నుంచి వెంటనే బయటికి పంపాలని మీడియాలో నానా యాగీ చేసింది. అయితే నటి రాఖీ సావంత్ మాత్రం ఇందుకు భిన్నంగా డైరెక్టర్ సాజిత్ ఖాన్ కి సపోర్ట్ చేసింది.. ఇప్పటికే అతను కృంగిపోతున్నాడు.. ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేవని.. చాలా కాలం తర్వాత బిగ్ బాస్ లో చోటు లభించిందని.. ఇలాంటి సమయంలో అతన్ని వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటాడని ఆ మద్య సోషల్ మీడియా వేధికగా అతనికి మద్దతు తెలిపింది.
ఆడవారిని అవమానించిన సాజిత్ ఖాన్ తరుపున వకాలత్ పుచ్చుకోవడంపై రాఖీ సావంత్ పై షెర్లీన్ చోప్రా మండిపడింది. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఇద్దరి మద్య మాటల యుద్దం మొదలైంది.. ఇప్పటికే సాజిత్ ఖాన్ పై షెర్లీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సాజిత్ ఖాన్ కి మద్దతుగా నిలుస్తున్న రాఖీ సావంత్ పై షెర్లి అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వీడియో, ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా షెర్లిన్ మాట్లాడుతూ.. నా గురించి మాట్లాడటం కాదు.. మీ తప్పులు తెలుసుకొని మాట్లాడండి.. మీటూ ఉద్యమం నేపథ్యంలో ఆరోపణలు చేసినవారందరూ అబద్దాలు చెబుతున్నారా? అంటూ రాఖీ సావంత్ పై ఫైర్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఈ విషయంపై నటి రాఖీ సావంత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. అంతేకాదు ఆమె లాయర్ తో వెళ్లి షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ సావంత్ మాట్లాడుతూ.. షెర్లిన్ కావాలనే కొంత మందిని బ్లాక్ మెయిల్ చేసి వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపించింది. ఏది ఏమైనా మీటూ ఉద్యమం నేపథ్యంలో చెలరేగిన ఈ వివాదం ఇద్దరు హాట్ బ్యూటీల మద్య రచ్చమొదలైంది.. ఇది ఎంత వరకు వెళ్తుంతో చూడాలి. ప్రస్తుతం ఈ వివాదం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए।
IPC 354
IPC 354A
IPC 499
IPC 500
IPC 509
IPC 503
IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999)P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022