షాపింగ్, షాప్ ఓపెనింగ్, ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో నటీమణుల పట్ల అభిమానులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వెళ్లిన నటి షాలు చౌరాసియాను ఓ వ్యక్తి వెంబండించిన సంగతి విదితమే. తాజాగా మరో నటికి చేదు అనుభవం ఎదురైంది.
ఇటీవల తారామణులకు పలు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. సోషల్ మీడియాలో నటీమణుల పట్ల అసభ్య పదజాలాన్ని వినియోగిస్తుంటారు కొందరు. అదీ చాలదన్నట్లు షాపింగ్, షాప్ ఓపెనింగ్, ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో వీరి పట్ల అభిమానులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న కేబీఆర్ పార్కులో వాకింగ్‌కు వెళ్లిన నటి షాలు చౌరాసియాను ఓ వ్యక్తి వెంబండించిన సంగతి విదితమే. అలాగే అంతక ముందు ఆకాశమే నీ హద్దు రాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి, జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన నటి అపర్ణా బాల మురళీ కృష్ణ. తంగం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాలేజీకి వెళ్లగా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన విద్యార్థి.. ఆమెపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. అపర్ణాకు ఇబ్బందిగా అనిపించడంతో ఆమె పక్కకు జరిగారు. తాజాగా మరో నటికి కూడా చేదు అనుభవం ఎదురౌందట.
మార్కెట్‌కు వెళ్లినప్పుడు తనను ఎవరో అభ్యంతరకర రీతిలో తాకారని బాలీవుడ్ నటి షెఫాలీ షా వెల్లడించారు. మొదట ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని భావించిన ఆమె తాజాగా ఈ సంఘటన గురించి మీడియాకు వెల్లడించింది. ఏఎన్‌ఐ పాడ్‌క్యాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ..‘నేను గతంలో చెప్పినట్లు అందరూ రకరకాల అనుభవాలు ఫేస్ చేసి ఉంటారు. అందులో నేను ఎదుర్కొన్న ఓ చేదు సంఘటన గురించి చెప్తాను. ఓసారి బాగా రద్దీగా ఉన్న మార్కెట్‌లో నడుచుకుంటూ వెళ్లాను. ఎవరో అనుచితంగా తాకడంతో కంపరంగా అనిపించింది. నేను గిల్టీగా ఫీలవడం కాదు కానీ ఇది నిజంగా సిగ్గుచేటు’అని అన్నారు.
ఆ పనికిమాలిన చర్యను అలాగే వదిలేశారా? అని మీరడగవచ్చు.‘ అవును.. ఆ సమయంలో అలానే వదిలేశాను. నేనే కాదు చాలామంది ఆ సమయంలో తామే ఏదో తప్పు చేసినట్లుగా ఫీలయ్యి దాన్ని మర్చిపోతారు. అలాంటి ధోరణికి మనం చెక్ పెట్టాలి. దాని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పుకొచ్చారు. కాగా షెఫాలీ షా.. 1995లో వచ్చిన రంగీలా సినిమా ద్వారా సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత సత్య సినిమా చేయగా ఈ చిత్రానికి ఉత్తమనటిగా ఫిలిం ఫేర్ అవార్డు వరించింది. ఇటీవల జల్సా, డార్లింగ్స్, డాక్టర్ జీ చిత్రాలతో మెప్పించింది. మరోవైపు ఢిల్లీ క్రైమ్, హ్యూమన్ వెబ్ సిరీస్‌లోనూ నటించగా తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.