సినిమాలలో యాక్ట్ చేస్తున్నపుడు సాధారణంగా చిన్నచిన్న ప్రమాదాలు జరగుతుంటాయి. కొన్ని సందర్భాలలో గాయాలు తీవ్రంగా జరుగుతాయి. వాటిని నటీనటులు అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అలాగే అర్చనా గౌతమ్ షూటింగ్ లో స్టంట్ చేస్తుండగా తీవ్రగాయాలపాలయ్యింది. దీనిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు షూటింగ్ సమయాల్లో పలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశంలో నటీనటులకు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దీంతో వాళ్లు ఆస్పత్రిపాలవుతుంటారు. గాయాలకు సంబంధించిన ఫొటోలు నటీనటులు ఇన్‌స్టాలో షేర్ చేసుకుంటారు. బాలీవుడ్ బిగ్ బాస్ -16 బ్యూటీ అర్చన గౌతమ్ షూటింగ్‌లో గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ -16 ద్వారా నటి అర్చన గౌతమ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అర్చన ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తుంది. దీనికి రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్నాడు. ఈ రియాల్టీ షో కి సంబంధించిన షూటింగ్ ముంబాయిలో జరుగుతుంది. తాజాగా జరుగుతున్నా షూటింగ్‌లో అర్చన గౌతమ్‌కు గాయాలు తీవ్రంగా అయినట్లు తెలుస్తుంది. తనకు గాయాలైన విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపింది. చికిత్స పొందుతున్న ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అర్చన గడ్డం కింద బలమైన గాయం అయినట్లు ఈ ఫొటోలో తెలుస్తుంది. ఆమె చిన్‌కు అయిన గాయానికి డాక్టర్లు స్టిచెస్ వేశారు. ఈ షోలో గౌతమి అత్యంత ధైర్యవంతమైన కంటెస్టెంట్. స్టంట్ చేస్తుండగానే తీవ్ర గాయాలయినట్లు అర్చన తెలిపింది. కాగా.. షూటింగ్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే రోహిత్ బోస్ రాయ్, ఐశ్వర్య శర్మ, నైరా బెనర్జీ, అంజుమ్ ఫకీ అర్జిత్ తనేజా వీరందరు స్టంట్స్ చేస్తూ గాయపడ్డారు. తాజాగా అర్చన గౌతమ్‌కు కూడా గాయాలయ్యాయి.
View this post on Instagram
A post shared by khatron ke khiladi 13 Khabri (@kkk13_biggbossott2.tazakhabar)