నమ్మించి దుబాయ్ తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారని నటి సన అన్నారు. బంగారం, డబ్బు అంతా లాగేసుకుని అత్త, మామలు టార్చర్ చేశారని వెల్లడించారు.
నటి సనా అంటే తెలియని వారు ఉండరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సనా.. బుల్లితెర యాంకర్ గా, ఆ తర్వాత సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 600 సినిమాల్లో నటించిన సనా సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. కృష్ణవంశి తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన సనా రీసెంట్ గా ఆయన డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చేదు సంఘటనలు అనేవి ఉంటాయని.. వాటితో ధైర్యంగా పోరాడి ముందుకు వెళ్లడమే మన కర్తవ్యం అని అన్నారు.
ఇక తన కూతురు గురించి మాట్లాడుతూ.. తన కూతురిని ఆమె అత్త, మామలు చాలా టార్చర్ పెట్టారని అన్నారు. తన కూతురి అత్త వైపు కుటుంబం తమను మోసం చేసిందని అన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులు సహాయం చేశారని, వారిని అరెస్ట్ చేశారని అన్నారు. అసలు తన కూతురి విషయంలో ఏం జరిగిందో ఆమె వెల్లడించారు. తన కూతురికి వివాహం చేశాక.. వాళ్ళు ఒక ఇల్లు చూపించి వేరే ఇంట్లో పెట్టారని.. దుబాయ్ తీసుకెళ్లి, ఆస్ట్రేలియా తీసుకెళ్లి తన కూతురిని చిత్ర హింసలు పెట్టారని.. అమ్మాయికి తిండి పెట్టకుండా ఇంట్లో బంధించారని అన్నారు. అమ్మాయి ఒంటి మీద ఉన్న బంగారం బ్యాంకులో పెడతామని తీసుకెళ్లి మొత్తం డబ్బులు కాజేశారని.. డబ్బుల కోసమే ఇంత నాటకం ఆడారని ఆమె అన్నారు.
ఇంత కష్టపడి పెళ్లి చేశారు కదా అని తన కూతురు తమకు ఈ విషయాలు చెప్పలేదని అన్నారు. చిత్రహింసలు పెట్టినా తమకు చెప్పలేదని.. అయితే తాను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు తన కూతురిని హింసిస్తున్నారని తెలిసి వాళ్ళతో ఫైట్ చేసి తన కూతుర్ని ఇండియా తీసుకొచ్చానని అన్నారు. మొత్తం ఆ కుటుంబం అందరూ మోసగాళ్ళే అని అన్నారు. ప్రస్తుతం తన కూతురు చాలా సంతోషంగా ఉందని.. తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగానే ఉంటుందని వెల్లడించారు. ఒక యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తుందని ఆమె అన్నారు. మరి సనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.