ఆ యువనటికి చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం పార్కులో నడుస్తుండగా ఓ వ్యక్తి వెంబడించాడు. ఆమెని చాలా ఇబ్బందిపెట్టేశాడు. చివరకు పోలీసుల రావడంతో అతడు ఎవరో గుర్తించారు.
నటీనటులకు అసలు ప్రైవసీ అనేదే లేకుండా పోతోంది. అయితే బాలీవుడ్ లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. మొన్నీమధ్యే హీరోయిన్ ఆలియా భట్ మాట్లాడుతూ.. తన ఇంట్లోకి ఓ ఇద్దరు వ్యక్తులు కెమెరాతో వీడియో తీస్తూ కనిపించారని చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్ యామీ గౌతమ్ కూడా ఇలాంటి దాని గురించె చెప్పుకొచ్చింది. ఓ వ్యక్తి.. ఫొటో అని చెప్పి తన బ్యాడ్ వీడియో తీశాడని, దాన్ని వైరల్ కూడా చేశాడని తెలిపింది. అయితే ఇలాంటివి మన దగ్గర జరగడం చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే తాజాగా ఓ యువనటికి జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కొండాపూర్ లో ఉండే ఆమె రోజూ సాయంత్రం కేబీఆర్ పార్కుకు వాకింగ్ కు వస్తూ ఉంటుంది. బుధవారం కూడా అలానే వచ్చింది. అయితే తనను ఎవరో ఫాలో చేస్తున్నారని ఆమెకు అర్థమైపోయింది. తను ఎక్కడ ఆగితే అక్కడ ఆడుతున్నాడు. నడిస్తే నడుస్తున్నాడని తెలుసుకుంది. ఇలా మొత్తం ఐదుసార్లు జరిగింది. తనతోపాటే వాకింగ్ కు వచ్చిన కొందరికి, పార్క్ భద్రతా సిబ్బందికి ఈ విషయం తెలియజేసింది. దీంతో అందరూ కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అయితే సిబ్బంది అతడిని పట్టుకుని మాట్లాడితే పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చాడు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చి అతడిని ప్రశ్నించగా.. తన పేరు శేఖర్ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఇదేనటి 2021లోనూ ఇదే పార్కులో నడుస్తుండగా ఓ వ్యక్తి బండరాయితో దాడి చేసి సెల్ ఫోన్, పర్స్ లాక్కెళ్లాడు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇలా రెండేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఆగంతకులు ఈమెని అనుసరించి దాడి చేయడం పలు సందేహాలకు రేకెత్తిస్తోంది. అయితే ఆ నటి పేరు షాలూ చౌరాసియా అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి నటిని ఆగంతకుడు వెంబడించడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.