Actress Shakeela: షకీలా అంటే ఇప్పటి తరం వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, నైన్‌టీస్ కిడ్స్‌కు మాత్రం ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1990లలో ఆమె తన బీగ్రేడ్ సినిమాలతో చాలా ఫేమస్ అయ్యారు. మలయాళంలో ఆమె క్రేజ్ గురించి చెప్పాలంటే.. అక్కడి స్టార్ హీరోలు కూడా షకీల క్రేజ్‌ముందు దిగదుడుపే. మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలతో సమానంగా షకీల సినిమాలు కలెక్షన్లను రాబట్టేవి. ఆమె తన కుటుంబం కోసం, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవటం కోసం బీగ్రేడ్ సినిమాల్లో నటించటం మొదలుపెట్టారు. ట్వంటీస్‌లోనే అలాంటి సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో ఆమె ప్రయాణం ‘తొట్టిగ్యాంగ్’తో మొదలైంది.
తర్వాత జయం, నిజం, దొంగోడు, ధూల్, కీలు గుర్రం, బంగారం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో దాదాపు 250 సినిమాల్లో నటించారు. తెలుగులో చివరగా కొబ్బరి మట్ట సినిమా చేశారు. అప్పుడప్పుడు టీవీ షోలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నారు. తాజాగా, ప్రముఖ తమిళ షో ‘కూకు విత్ కోమలి’కి గెస్ట్‌గా వెళ్లారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్ షీతల్‌ను ఉద్ధేశిస్తూ మాట్లాడారు.
షకీల మాట్లాడుతూ.. ‘‘ షీతలా.. నేను ఇంకా ఎందుకు ఆ పేరును మర్చిపోలేదంటే.. నా సొంత చెల్లి పేరు కూడా షీతల్. ‘ఓ ప్యారీ పానీ పూరీ’ సాంగ్‌లో డ్యాన్స్ వేసింది. ఇప్పుడు తను లేదు. 23 ఏళ్ల వయసులోనే తను చనిపోయింది. అందుకే ఈ సారి షీతల్ కోసం షో చూస్తున్నా’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా, షకీల చెల్లెలు షీతల్ ప్రముఖ స్టార్ హీరో విజయ్‌తో కలిసి ‘పువ్వే ఉనక్కాగ’ సినిమాలో ‘ఓ ప్యారీ పానీ పూరీ’ పాటకు డ్యాన్స్ చేశారు. మరి, షకీల తన చెల్లెలు షీతల్ గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : A N D Prasad: ఉరివేసుకుని ప్రముఖ నటుడు ఆత్మహత్య!