అర్జున్ రెడ్డి చిత్రానికి ముందు విజయ్ దేవరకొండ ఒక మాములు హీరో. కానీ అర్జున్ రెడ్డి మూవీ ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. దేశవ్యాప్తంగా విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. తన స్టైల్ తో విజయ్ రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ తో కలిసి నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తహతహలాడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి సారా అలీఖాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విజయ్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనన్య పాండే, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సారా అలీఖాన్ విజయ్ పై తనకున్న అభిమానాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వ్యక్తపరిచింది. విజయ్ చాలా హాట్ అండ్ కూల్.. అంటూనే విజయ్ తో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం తన ఫేవరెట్ హీరో.. విజయ్ దేవరకొండనే అంటోంది కుర్రది. తన పోస్ట్ లో విజయ్ తో కలిసి దిగిన ఓ సెల్ఫీని సారా యాడ్ చేసింది. అప్పట్లో వీరి పిక్ చాలా వైరల్ అయింది. అదీగాక.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. రౌడీ హీరో పై సారా అలీఖాన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.