యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సంజన గల్రానీ. ఈ భామ తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసినప్పటికి ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో అంతగా కనిపించటం లేదు. అయినప్పటికి సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. 2021 జనవరిలో సంజన.. తన చిరకాల మిత్రుడు డాక్టర్ పాషాను రహస్య వివాహం చేసుకుంది. అనంతరం కొన్నాళ్లుకు ఆ విషయాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతుంది. తాజాగా బేబి బంప్ తో సంజన చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సీమంతం జరుపుకున్నట్లు సమాచారం. సీమంతం రోజు సంజనా ఫుల్ ఖుష్ అయింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. “ఎంతో ప్రేమగా నా ఫ్రెండ్స్ నా సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు” అంటూ పేర్కొంది. ఇప్పుడు బేబి బంప్ తో సంజన దిగిన ఫిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. బేబి బంప్ తో సంజన గల్రానీ దిగిన ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.