తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో మధురమైన అనుభూతి. నవ మోసాలు మోసి.. ఓ బిడ్డకు జన్మనివ్వడం అనే ఆ అనుభూతిని వర్ణించడం మాటల్లో సాధ్యం కాదు. ప్రస్తుతం అదే ఫీలింగ్‌ని ఏంజాయ్ చేస్తున్నారు సంజనా గల్రానీ. బుజ్జిగాడు, సత్యమేవ జయతే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంజనా గల్రానీ. ఇటీవలే గ్రాండ్‌గా సీమంతం జరుపుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. బాబు పుట్టాడు, కంగ్రాచ్యులేషన్స్ అన్న క్యాప్షన్‌ను జోడిస్తూ సంజనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సంజనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరో వైపు సంజన చెల్లి నిక్కీ గల్రానీ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. మే 18న ఆమె హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గుడ్‌న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బిగ్‌బాస్ కన్నడ మాజీ కంటెస్టెంట్ అయిన సంజన గల్రానీ శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయి మూడు నెలలు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు అజీజ్ పాషాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.