రంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగి.. అర్థంతరంగా మాయమైపోతుంటారు. రిచా గంగోపాధ్యాయ, కమలిని ముఖర్జీ,, సదా, పూర్ణ వంటి వారు ఆ జాబితాలో ఉంటారు. అయితే ఏకంగా సినీ పరిశ్రమకు రిటైర్ మెంట్ ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది ప్రముఖ నటి. ఇప్పుడు ఓ శుభవార్తతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు అర్థంతరంగా కనుమరుగౌతుంటారు. ఆ జాబితా కోసం వెతికితే పెద్ద లిస్ట్లే ఉంటుంది. మంచి సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటారు. అంతలోనే అనివార్య కారణాలతో సినిమాలకు గుడ్ బై చెప్పి చదువుల కోసమని, వ్యాపారాల నిమిత్తం లేదంటే వివాహాలు చేసుకుని సెటిల్ అయిపోతారు. ఏదో ఓ సందర్భంలో వాళ్ల పేర్లు తెరపైకి వస్తుంటారు. అటువంటి వారిలో ఒకరు సనాఖాన్. 2005లో ఓ చిన్న సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది..తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ప్రముఖ హీరోలతో నటించింది. తర్వాత హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఆ షో ఆమెకు మంచి పేరు తెచ్చింది. అంతలోనే ఇస్లామిక్ పండితుడు ముఫ్తీ అనస్ సయ్యద్ ను వివాహం చేసుకుని, సినిమాలకు రిటైర్‍మెంట్ ప్రకటించింది.
అయితే తాజాగా ఆమె ఓ స్వీట్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలోనే ఆమె తాను గర్భవతినని కొన్ని హింట్స్ ఇచ్చింది. ఈ ఏడాది హాజ్ తీర్థ యాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సనాఖాన్ అప్పుడే సంతోషకర వార్తను పంచుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భార్యా భర్తలు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. తాను గర్భం దాల్చానని, జూన్ చివరిలో తన డెలివరీ అని వెల్లడించింది. ఇది పూర్తిగా భిన్నమైన ప్రయాణమని చెప్పుకొచ్చింది సనాఖాన్. ఈ సమయంలో ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇది తాను అందమైన ప్రయాణం అనుకుంటున్నానని, తన బిడ్డను తన చేతులతో ఎత్తుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. అయితే కవలలు వస్తున్న వార్తలను ఖండించిన ఆమె…ఒక్కరేనని తెలిపింది.
సనాఖాన్ ఏ హి హై సొసైటీ అనే సినిమాతో పరిచయమైన ఆమె.. ఐదు ప్రాంతీయ భాషల్లో నటించింది. తెలుగులో కూడా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కత్తి సినిమాలో కనిపించింది. అందులో మరో హీరో కిక్ శ్యామ్ సోదరిగా నటించింది. నాగార్జున నటించిన గగనం, మంచు మనోజ్ నటించిన మిస్టర్ నోకియా సినిమాలో కూడా కనిపించింది. అటు తమిళ్ లోనూ శింబు, విశాల్ వంటి స్టార్ హీరోల ప్రక్కన నటించింది. అంతేకాకుండా పలు సినిమాల్లో్ స్పెషల్ రోల్స్ చేసింది. సల్మాన్ ఖాన్ జై హోలో నటించింది. 2019లో చివరిగా విశాల్ నటించిన అయోగ్యలో కనిపించిన ఆమె.. 2020లో ముఫ్తీని వివాహం చేసుకుని, పూర్తిగా సినిమాల నుండి తప్పుకుంది.