తెలుగు బుల్లితెరపై అటు బిగ్ బాస్ ఇటు ఎవరు మీలో కోటీశ్వరులు షోలతో ప్రేక్షకులు విపరీతమైన వినోదాన్నిపొందుతున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఎవరు మీలో కోటీశ్వరులు. టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ గేమ్ షోలో ఇటీవల టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు గెస్ట్ లు విచ్చేశారు. ఇక ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ, దర్శకధీరుడు రాజమౌళి వంటి సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. కాగా ఇదే షోకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నాడంటూ వార్తలు కూడా ఊపందుకున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రిన్స్ కాకుండా టాలీవుడ్ అగ్రకథానాయికగా వెలుగొందుతున్న సమంత రానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి సమంత నిజంగానే వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల నాగచైతన్యతో సమంత విడాకుల తీసుకోబోతున్న విషయం తెలిసిందే. దీంతో సమంత ఎవరు మీలో కోటీశ్వరులు గెస్ట్ గా రావచ్చు, రాకపోవచ్చు అనే క్లారిటీ లేకుండా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.