టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టరస్‌లో ముందు వరుసలో ఉండే నటి సాయి పల్లవి. హడావుడిగా సినిమాలు చేస్తూ లైమ్ లైట్‌లో ఉండాలని కోరుకోదు. తన అందాన్ని తెరమీద ప్రదర్శించేందుకు మేకప్స్ ఎక్కువ వేసుకోదు. ఎంత డిమాండ్ చేసినా యాడ్స్‌లో నటించదు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ.. కుటుంబ సభ్యులతో కావాల్సిన సమయం గడుపుతూ..వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకుంటున్న నటి సాయి పల్లవి. అందుకే నటిగా, వ్యక్తిగతంగా ఆమెను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఆరాధిస్తుంటారు. నాట్యంలో నెమలిని తలపించే అందం, నటనలో ఆమె ఫెర్మామెన్స్.. గర్ల్ నెక్ట్స్ డోర్‌లా ఉంటుంది.
చూసీగా సినిమాలు చేసుకుంటూ.. కూల్ గా వెళ్లిపోతుంది ఈ నాచ్యురల్ బ్యూటీ. విరాటపర్వం, గార్గీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ నటి.. ఇప్పుడు శివ కార్తీకేయన్ సినిమాలో నటించబోతుంది. అయితే ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదీ కూడా పురాణ ఇతిహాస గాధలకు సంబంధించిన కథలో ఆమె నటించబోతుందట. మరోసారి రామయాణాన్ని సిల్వర్ స్క్రీన్‌పై తెరకెక్కించనున్నారట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని సమాచారం. అందులో సీత పాత్రలో ఆమెను ఊహించుకున్నాడట దర్శకుడు.
కాగా, రాముడి పాత్రలో రణబీర్ కపూర్, రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సాయి పల్లవి చాలా భక్తి ఎక్కువ. ఇప్పుడు ఈ సీత పాత్ర తన వద్దకు వస్తే ఒప్పుకుంటుందో లేదో చూడాలి. కాగా, ప్రస్తుతం దర్శకుడు నితీష్.. వరుణ్ ధావన్,జాన్వీ కపూర్ జంటగా బవాల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ సినిమాపై కసరత్తులు చేయనున్నారు. అయితే ఇప్పటికే రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకుని ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. ఈ నెల 16న థియేటర్లలో సందడి చేయనుంది. సీత పాత్రలో కృతి సనన్ నటించిన సంగతి విదితమే.