సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘మేజర్’ చిత్రం జూన్ 3 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అందరి హృదయాలను కదిలించింది. ఈ మూవీ థియేటర్లో చూసిన నటి సదా భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘జయం’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది సదా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన సదాకి పెద్దగా పేరు రాలేదు. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. ఈ మద్య కొన్ని రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది. ఈ మద్య యూట్యూబ్, సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటున్నారు. ఈ మద్య మేజర్ చిత్రాన్ని వీక్షించిన సదా.. ఫస్ట్ హాఫ్లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక థియేటర్లో కన్నీళ్లు పెట్టేసుకున్నారు.
మేజర్ చిత్రం చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన సదా తన అభిప్రాయాలను పంచుకుంది. ప్రస్తుతం తాను ముంబయిలోనే ఉన్నానని.. మేజర్ చిత్రం చూస్తున్నంత సేపు నాకు ఆ రోజు జరిగిన విషాదం గుర్తుకు వచ్చింది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఏమోషనల్ అయ్యానని తెలిపింది. ఇక దర్శకులు శశి కిరణ్ మూవీ తీసిన విధానం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. హీరో అడవి శేష్ యాక్టింగ్ చాలా బాగుందని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
‘After a very long time I have seen a movie which left me heavy & emotional’
Popular actress #Sadha‘s heartfelt reaction after watching #MajorTheFilm 🇮🇳
Book your tickets now!#IndiaLovesMajor ❤️ pic.twitter.com/OYTGtLbwQg
— GMB Entertainment – MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 18, 2022