ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోయి వస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు తాము ఎంతగానో అభిమానించే నటీ, నటులు ఆత్మహత్యలకు పాల్పపడటం కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల కాలంలో చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు ప్రేమ వ్యవహారాలు, డిప్రెషన్, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోయి వచ్చాయి. భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ప్రముఖ ఒడియా నటి, సింగర్ ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ ఒడియా నటి, సింగర్ రుచిస్మిత గురు తన మామ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఒడిషాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు సింగర్ గా ఎన్నో ఆల్బామ్స్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది రుచిస్మిత గురు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు వస్తున్న ఈ సమయంలో రుచిస్మిత ఆత్మహత్య చేసుకోవం దిగ్బ్రాంతికి గురి చేసింది. నటి రుచిస్మిత ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ కేసు విషయంలో రుచిస్మిత తల్లి పెద్ద ట్విస్ట్ ఇచ్చిందని.. తనతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తెలిపింది.
ప్రస్తుతం రుచిస్మిత బలంగీర్ జిల్లా సుదాపాడ లో ఉన్న తన మేనమామ ఇంట్లో ఉంటుంది. ఎన్నో ఆల్బామ్స్, స్టేజ్ షోలు ఇచ్చి రుచిస్మిత బాగా పాపులారిటీ సంపాదించింది. ఈ మద్య సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం రుచిస్మిత తన గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం భీమా భోయ్ మెడికల్ కాలేజ్ కి పంపించారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారణ చేస్తున్నారు. చిన్న వయసులోనే మంచి నటిగా ఎదుగుతున్న రుచిస్మిత ఆత్మహత్య చేసుకోవడంతో సినీ సెలబ్రెటీలు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
విచారణ సందర్భంగా రుచిస్మిత తల్లి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆత్మహత్యకు ముందు తన కూతురు రాత్రి భోజనం చేసే విషయంలో తనతో గొడవ పడిందని.. ఆదివారం రాత్రి 8 గంటలకు పరోటా చేయమని కోరిందని.. నేను 10 గంటలకు చేస్తానని చెప్పడంతో తనతో గొడవ పడిందని.. వెంటనే తన రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడిందని వెల్లడించింది. గతంలో కూడా తన కూతురు పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని తల్లి పేర్కొంది. ఇది ఆత్మహత్యా? మరేదైనా జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత అసలు విషయాలు బయట పడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.