ఏ సమయంలో టాలీవుడ్ లో అడుగుపెట్టిందో కానీ వరుస విజయాలతో దూసుకపోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. “ఛలో” సినిమాతో తెలుగులో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన రష్మిక.. ఛలో అంటూనే ముందుకు సాగిపోతుంది. “గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ” వంటి చిత్రాలతో వరుస హిట్లు తన ఖాతలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల విడుదలైన “పుష్ప” సినిమాతో ఈ భామ స్టార్ డమ్ పీక్స్ కు చేరిందనే చెప్పాలి. తన అందంతో కుర్రకారు మతి పొగొట్టేస్తుంది. అయితే తాజాగా తనను వివాహమాడే వ్యక్తి ఎలా ఉండాలి అనేదాని పై క్లారిటి ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ.
హీరో శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. సినిమాలో సీనియర్ నటీమణులు ఖుష్బు, రాధిక శరత్ కుమార్, ఊర్వశి కీలక పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్నారు. రాక్‌స్టార్ DSPసంగీతం అందించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మూవీ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీకు కాబోయే వాడు ఎలా ఉండాలనే దానిపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ధీటుగానే సమాధానం ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ.
రష్మిక స్పందిస్తూ.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది.”ఎవరి దగ్గర అయితే సెక్యూర్‌గా ఫీల్ అవుతామో.. కంఫర్ట్ గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటాం అనిపిస్తుందో అతడే జీవితంకు మంచి లైఫ్ పార్టనర్.. అలాంటి వాడినే భర్తకు ఎంచుకుంటాను. అలాగే ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది లవ్ అవుతుంది. అలా కాకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటాను” అని తన మనసులో మాటను రష్మిక వెల్లడించింది. అయితే డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా షికార్లు చేస్తున్నాయి. రష్మిక వెల్లడించిన పెళ్లి విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.