ఓ స్టార్ హీరోయిన్ తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. తాను తల్లి అయిన రోజుల్లో ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చింది. తన కూతురు 7వ నెలలోనే పుట్టడంతో.. ఎందో కంగారు పడ్డాను అంటూ ఆ కఠిన పరిస్థితులను గుర్తుచేసుకుంది.
సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ అనగానే.. ఎలాంటి కష్టాలు లేకుండా రాజభోగాలు అనుభవిస్తారు అనుకుంటాం. అయితే అది అందరి విషయాల్లో జరగదు. కొంత మంది జీవితాల్లో ఎన్నో కఠినమైన రోజులు అనుభవించాల్సి వస్తుంది. అలాంటి రోజులు వచ్చినప్పుడు సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం విధికి తలొగ్గాల్సిందే. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. తాను తల్లి అయిన రోజుల్లో ఎంత నరకం అనుభవించిందో చెప్పుకొచ్చింది. తన కూతురు 7వ నెలలోనే పుట్టడంతో.. ఎందో కంగారు పడ్డాను అంటూ ఆ కఠిన పరిస్థితులను గుర్తుచేసుకుంది. మరి ఇంతకీ ఎవరా హీరోయిన్? ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. తన నటనతో ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు రాణీ ముఖర్జీ. తన అందంతో.. నటనతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే 2014లో స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికి పాపకు జన్మనిచ్చింది రాణీ ముఖర్జీ. అయితే డెలివరీ సమయంలో తాను ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు ఏ స్త్రీకి కూడా రాకూడదు అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా రాణీ ముఖర్జీ మాట్లాడుతూ..”నా కుమార్తె రెండు నెలలు ముందుగానే పుట్టింది. అంటే 7వ నెలలోనే నా బిడ్డ పుట్టింది. అప్పుడు చాలా సన్నగా బేబీ ఉండటంతో.. నేను తీవ్ర ఒత్తిడికి గురైయ్యాను. ఒక తల్లిగా ఆ బాధ ఎవ్వరికీ రాకూడదు. ఇక బేబీని 7 రోజులు ఐసీయూలోనే ఉంచారు. మెుత్తం 15 రోజులు నేను ఆస్పత్రిలోనే ఉండి తీవ్రంగా కుంగిపోయాను. అయితే అదృష్టం కొద్ది నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చింది” అంటూ అప్పటి కఠిన పరిస్థితులను గుర్తుకు చేసుకుని భావోద్వేగానికి గురైంది. తన కుమార్తెకు ఆదిరా అని పేరు పెట్టినట్లు తెలిపింది. పాప పుట్టాక నటనకు కొంత విరామం ఇచ్చింది రాణీ ముఖర్జీ. 2018లో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మర్దానీ 2, బంటీ ఔర్ బబ్లీ 2, తాజాగా మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రాల్లో మెరిసింది.