సినిమా వాళ్లు తగిన ఫిజిక్‌ను మెయిన్‌టేన్ చేయటానికి ఎక్కువగా జిమ్ములో గడుపుతూ ఉంటారు. ఇలా వ్యాయామాలు చేస్తున్న సమయంలో ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్నా.. జనాల్ని ఎక్కువ కాలం మెప్పిస్తూ ఉండాలన్నా లుక్ చాలా ముఖ్యం. హీరోలు కావచ్చు.. హీరోయిన్లు కావచ్చు మంచి ఫిజిక్ మెయిన్‌టేన్ చేస్తేనే అన్ని విధాలా లైఫ్ ఉంటుంది. అందుకే జెండర్‌తో సంబంధం లేకుండా అందరూ జిమ్ముల్లో వాలిపోతూ ఉంటారు. గంటలు, గంటలు కసరత్తులు చేస్తూ ఉంటారు. అలా కసరత్తులు చేస్తున్న సమయంలో కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాల్లో గాయపడ్డ నటులు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా, ప్రముఖ తమిళ నటి రమ్య సుబ్రమణియన్ జిమ్ములో వర్కవుట్లు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
ఒకరకంగా యముడికి హాయ్ చెప్పి వచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రమ్య జిమ్ములో వర్కవుట్లు చేస్తూ ఉన్నారు. గ్లూటీల్ కండరాలను టార్గెట్ చేస్తూ ఎక్సర్‌సైజు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన నడుం మీద 40 కేజీల డంబెల్ పెట్టుకుని ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత ఆ డంబెల్ పట్టుతప్పి ఆమె తలవైపు దూసుకువచ్చింది. ఆ తర్వాత వేగంగా ఆమె గొంతు దగ్గరకు వచ్చింది. 40 కేజీల డంబెల్ ఆమె గొంతును నొక్కిపడేసింది. దీంతో ఆమెకు ఊపిరి ఆడలేదు. ఊపిరి ఆడక అల్లాడిపోతున్న ఆమెను పక్కనే ఉన్న వారు గుర్తించారు.
వెంటనే డంబెల్‌ను మెడ మీద నుంచి పక్కకు తీశారు. రమ్య ప్రాణాలతో బయటపడగలిగారు. లేదంటే పెను విషాదం చోటుచేసుకునేది. ఇక, ఇదే విషయం గురించి రమ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. తనకు జరిగిన ప్రమాదం గురించి వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైతం పోస్టు చేశారు. ఎప్పుడూ బరువులతో కూడిన వర్కవుట్లు చేయవద్దని ఫ్యాన్స్‌ను హెచ్చరించారు. మరి, హెవీ వర్కవుట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న రమ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.