Ramya Krishna: రమ్యకృష్ణ.. పాత్రలకు ప్రాణం పోసే నటనతో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నరసింహ’ సినిమాలో నీలంబరిగా కావచ్చు.. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా కావచ్చు.. ఆ పాత్రలకు ఆమె తప్పితే వేరే ఛాయిస్ లేదు అన్నంతగా నటించారు. రమ్యకృష్ణ 13 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. ‘నేరం పులరుంబోల్’ అనే మలయాళ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు.
సౌత్‌లో రెండు దశాబ్ధాలు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లాడారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. రమ్యకృష్ణ గత కొన్ని సంవత్సరాలనుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రల్లో నటిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు టీవీ షోలు కూడా చేస్తున్నారు. తాజాగా, రమ్యకృష్ణ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమె డైలీ బేసిస్ మీద రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. ఒక రోజుకు ఏకంగా రూ. 10లక్షలు తీసుకుంటుందని సమాచారం. ఒక సినిమాకు ఆమె 10 రోజుల కాల్ షీట్లు ఇస్తే.. కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రోజులు పెరిగే కొద్దీ 10 లక్షలు డబుల్ అవుతుంటాయి. మరి, రమ్యకృష్ణ సెకండ్ ఇన్సింగ్స్‌లోనూ భారీగా రెమ్యూరేషన్ తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Upasana Konidela: పిల్లల్ని వద్దనుకున్న రామ్‌చరణ్ దంపతులు అంటూ వార్తలు!